Health Tips: రోజూ డ్రైఫ్రూట్స్ ఎలా తినాలి, ఎలా తింటే అధిక ప్రయోజనాలు కలుగుతాయి
Health Tips: చలికాలంలో ఇమ్యూనిటీని కాపాడుకోకపోతే..చాలా వ్యాధులు చుట్టుముడతాయి. ప్రతిరోజూ పరగడుపున అవి తీసుకుంటే..అనారోగ్యం మీ దరికిచేరదు.
చలికాలంలో రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కేందుకు రోజూ డ్రైఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
డ్రై ఫ్రూట్స్ అనేవి పోషకాలలో నిండి ఉంటాయి. చలికాలంలో చాలా మంచిది. డ్రైఫ్రూట్స్‌ను పెరుగు, ఓట్స్, దలియా, స్మూదీల్లో నానబెట్టి ఉదయం పరగడుపు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. డ్రైఫ్రూట్స్ పరగడుపున తీసుకుంటేనే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల బాడీ ఆరోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. ఆ లాభాలేంటో మనం తెలుసుకుందాం..
ఉదయం పరగడుపున డ్రైఫ్రూట్స్
ప్రతి రోజూ ఉదయం పరగడుపున బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మస్తిష్కం వేగవంతమౌతుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మానికి చాలా మంచిది. అందుకే ప్రతిరోజూ పరగడుపున బాదాం తినడం అలవాటు చేసుకోండి.
పిస్తా
చాలామందికి రోజూ ఉదయం లేవగానే ఆకలేస్తుంటుంది. దీనికి పిస్తా మంచి పరిష్కారం. ఉదయం తినడం వల్ల ఆకలి తీరడమే కాకుండా రోజంతా కడుపు నిండకుండా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, ఐరన్ ఉన్నాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్, స్థూలకాయం సమస్యలకు దారితీస్తుంది.
కిస్‌మిస్ పండ్లు
చాలామంది ఉదయం లేవగానే రాత్రి నానబెట్టిన కిస్‌మిస్ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా లాభాదాయకం. పరగడుపున తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.
Also read: Milk Combination Foods: పాలతో ఆ పదార్ధాలు పొరపాటున కూడా తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook