Foods to Increase Asthma Attack: మనిషి శరీరంలో గుండె, కిడ్నీ, లివర్ ఎంత ముఖ్యమైనవో ఊపిరితిత్తులు అంతే ప్రధానమైనవి. ఊపిరితిత్తుల సమస్య ప్రమాదకరమైన ఆస్తమాకు దారి తీయవచ్చు. అందుకే ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే జాగ్రత్తలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఆస్తమా రోగులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. కారణం చలి గాలుల కారణంగా ఈ సమస్య తీవ్రమౌతుంది. అదే సమయంలో వేసవిలో కూడా ఆస్తమా ముప్పు పెరుగుతుంది. కారణంగా వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎప్పుడైతే చల్లటి పదార్ధాలు లేదా చల్లని పానీయాలు తీసుకుంటారో..శ్వాస నాళాలు వాచిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురౌతాయి. అందుకే ఆస్తమా రోగులు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆస్తమా రోగులు ఎప్పుడూ హెల్తీ ఫుడ్స్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో కొన్ని రకాల ఆహార పదార్ధాల్నించి నియంత్రణ లేదా దూరం పాటించాలి. ఆస్తమా రోగులు ఏయే పదార్ధాలకు దూరంగా ఉంటే మంచిదో పరిశీలిద్దాం..


ఆస్తమా రోగులు ప్రధానంగా ప్రిజర్వేటివ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా నిల్వ ఉంచేందుకు ఏయే పదార్ధాల్లో సల్ఫైజ్ ఉపయోగిస్తారో వాటిని దూరం పెట్టాలి. ఉదాహరణకు పికిల్స్, ప్యాక్డ్ జ్యూస్ వంటివి ఆస్తమా రోగులకు ఏమాత్రం మంచివి కావు. అదే సమయంలో చల్లని పానీయాలు కూడా తాగకూడదు. 


Also Read: Nutrition Deficiency: విటమిన్ డి నుంచి విటమిన్ బి12 వరకూ 5 ముఖ్యమైన న్యూట్రిషన్ లోపాల్ని ఎలా అధిగమించాలి


ఆస్తమా రోగులు చల్లటి, పుల్లటి పదార్ధాలకు దూరం పాటించాలి. ముఖ్యంగా ఐస్ క్రీములు, చల్లని నీళ్లు, నిమ్మకాయ, పికిల్స్,పెరుగు వంటివాటికి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే ఆస్తమా పెరిగే అవకాశాలున్నాయి. ఆస్తమా పెరగడమే కాకుండా దగ్గు కూడా ఎక్కువౌతుంది. ఆహార పదార్ధాలు, పానీయాలపై శ్రద్ధ తీసుకున్నంతవరకూ ఆస్తమా సమస్య నియంత్రణలో ఉంటుంది. ఆహార పదార్ధాల విషయంలో చింతపండు కలిసే పులుసుకు దూరంగా ఉండాలి.


ఇక రోజువారీ దినచర్యలో భాగంగా చాలామంది టీ లేదా కాఫీ ఎక్కువగా సేవిస్తుంటారు. ఆస్తమా రోగులకు మాత్రం ఈ అలవాటు మంచిది కాదనే చెప్పాలి. టీ కాఫీ సాధ్యమైనంత వరకూ తగ్గించేయాలి లేదా మానేయాలి. ఎందుకంటే టీ లేదా కాఫీ వల్ల ఆస్తమా సమస్య పెరుగుతుంది. గ్యాస్ సమస్య కూడా తోడవుతుంది. దాంతో ఆస్తమా ఎటాక్‌కు దారి తీయవచ్చు.


Also Read: Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్థులు ఖర్జూరం తినవచ్చా లేదా, వాస్తవమేంటి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook