Asthma Diet Tips: రోజూ ఈ పండ్లు తింటే చాలు ఆస్తమాకు ఇన్‌హేలర్ అవసరం కూడా రాదిక
Asthma Diet Tips: మనిషి ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఆ విలువ తెలుస్తుంది. కొన్ని వ్యాధులు ఒకసారి చుట్టుముడితే జీవితాంతం వెంటాడుతుంటాయి. అదే పనిగా మందులు వాడుతూ ఉండాల్సిందే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Asthma Diet Tips: దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానమైనవి అధిక రక్తపోటు, మధుమేహం, రెస్పిరేటరీ వ్యాధులు, ఆస్తమా ఉన్నాయి. ఇవన్నీ చికిత్స లేని వ్యాధులే. ఎప్పటికప్పుడు మందులు వాడుతూ నియత్రణలో ఉంచుకోగలం. ఇవాళ మనం చర్చించేది ఆస్తమా గురించి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమాను నియంత్రించడమే కాదు..అదే పనిగా ఇన్‌హేలర్ తీసుకునే అవసరం కూడా ఉండదంటున్నారు.
ఇటీవలి కాలంలో అంటే ఆధునిక జీవన విధానంలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఎలా వ్యాపిస్తున్నాయో ఆస్తమా ముప్పు కూడా అలానే పెరుగుతోంది. ఆస్తమా అనేది చికిత్స లేని వ్యాధి. ఒకసారి సోకిందంటే జీవితాంతం మందులు లేదా ఇన్ హేలర్ వాడాల్సిందే. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆస్తమాను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనికోసం డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..కొన్ని పండ్లను తప్పకుండా ప్రతిరోజూ తినాలంటున్నారు వైద్యులు.
ఆస్తమా రోగులకు స్ట్రా బెర్రీ ఫ్రూట్స్ అద్భుత ప్రయోజనాలను కల్గిస్తాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి అనేది ఊపిరితిత్తుల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆస్తమా సమస్యల్ని దూరం చేసేందుకు డైట్‌లో స్ట్రాబెర్రీ పండ్లను తప్పకుండా చేర్చుకోవాలి. ఆస్తమా వ్యాధి నియంత్రణలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పనిచేస్తుంది. బరువు కూడా తగ్గించుకోవచ్చు. స్ట్రాబెర్రీ పండ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాలి.
ఆస్తమా లక్షణాల్ని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఒక యాపిల్ తినాలి. అందుకే యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అనే మాట అనాదిగా ఉన్నదే. యాపిల్ అంత అద్భుతమైంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ పెద్దమొత్తంలో ఉంటాయి. ఊపిరితిత్తుల స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తుంది. ఆస్తమాను నియంత్రిస్తుంది.
ఆస్తమా వ్యాధిగ్రస్థులకు ఆరెంజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. రోజూ ఒక ఆరెంజ్ తినడం వల్ల ఆస్తమాను సులభంగా నియంత్రించవచ్చు.
Also read: Summer Drinks: శరీరంలో వేడి తగ్గించి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే 5 అద్భుతమైన డ్రింక్స్ ఇవే
ఈ డైట్ మార్పులతో పాటు ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం లేదా రెండు పూట్లా కనీసం 15-20 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. రోజూ ఉదయం వేళ గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇక రోజంతా చల్లని నీళ్లు పొరపాటున కూడా తాగకూడదు. నార్మల్ వాటర్ మాత్రమే తీసుకోవాలి.
Also read: Weight loss tips: ప్రతిరోజూ ఈ స్నాక్స్ తీసుకుంటే..21 రోజుల్లో ఫిట్ అండ్ స్లిమ్ బాడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook