Summer Drinks: శరీరంలో వేడి తగ్గించి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే 5 అద్భుతమైన డ్రింక్స్ ఇవే

Summer Drinks: వేసవి వచ్చిందంటే చాలు తాపం పెరిగిపోతుంటుంది. బయటి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దాహం పెరుగుతుంటుంది. శరీరానికి కావల్సినంత నీరు లభించకపోతే డీహైడ్రేషన్ సమస్య వెంటాడుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 03:41 PM IST
Summer Drinks: శరీరంలో వేడి తగ్గించి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే 5 అద్భుతమైన డ్రింక్స్ ఇవే

Summer Drinks: డీ హైడ్రేషన్ అనేది చాలా ప్రమాదకరం. ఎంత సాధారణంగా కన్పిస్తుందో అంత ప్రమాదమైంది. వేసవిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. డీ హైడ్రేషన్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వేసవిలో డీ హ్రైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు కావల్సిన అద్భుతమైన 5 సమ్మర్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం..

వేసవిలో బయటి ఉష్ణోగ్రతను మనం తగ్గించలేకున్నా శరీర ఉష్ణోగ్రతను మాత్రం అద్భుతంగా తగ్గించవచ్చు. శరీరం ఎప్పటికప్పుడు హైడ్రేట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేసవి ప్రతాపం పెరుగుతోంది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఏపీలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శరీరంలో అంతర్గత వేడిని చల్లార్చుకోవల్సిన అవసరముంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా శరీరం భారంగా మారుతోంది. ఫలితంగా డీ హైడ్రేషన్, అలసట, వడదెబ్బ సమస్యలు ఎదురౌతున్నాయి. శరీరం తాపమానాన్ని తగ్గించాలంటే శరీరం హైడ్రేట్‌గా ఉండాలి. శరీరం వేడిని తగ్గించే టాప్ 5 బెస్ట్ సమ్మర్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం..

మామిడి రసం

మామిడి రసం వేసవిలో అత్యద్భుతమైన డ్రింక్. పచ్చి మామిడితో చాలా సులభంగా చేయవచ్చు. ఇందులో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉండటం వల్ల శరీరం ఉష్ణోగ్రత తగ్గించేందుకు అద్భుతంగా దోహదపడుతుంది.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లను సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. శరీరంలోని లిక్విడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో తక్కువ కేలరీలు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

మజ్జిగ

మజ్జిగ అనాదిగా వస్తున్న ఓ మంచి డ్రింక్. వేసవిలో మజ్జిగను మించింది లేదు. శరీర తాపం తగ్గించడమే కాకుండా చలవ చేసే అద్భుతమైన డ్రింక్. జీర్ణక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.ఇందులో కూడా కేలరీలు తక్కువగా ఉండి..కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి.

లెమన్ వాటర్

వేసవిలో దాహం తీర్చేందుకు అద్భుతంగా ఉపయోగపడే డ్రింక్ లెమన్ వాటర్. లెమన్ వాటర్ చేయడం కూడా చాలా సులభం. మనిషి శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. డీ హైడ్రేషన్ సమస్య తలెత్తినప్పుడు లెమన్ వాటర్ తక్షణం ఉపశమనం కల్గిస్తుంది.

Also read : Kidney life Tips: ఆ అలవాట్లు మానుకోకపోతే మీ కిడ్నీ లైఫ్ తగ్గిపోతుంది జాగ్రత్త

పుచ్చకాయ జ్యూస్

వేసవిలో చాలా అధికంగా లభించే మరో ఫ్రూట్ పుచ్చకాయ. ఇందులో నీళ్లు పుష్కలంగా ఉండటమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ భారీ మొత్తంలో ఉంటాయి. వేడి తగ్గించేందుకు పుచ్చకాయ సూపర్ డ్రింక్‌ గా చెప్పవచ్చు. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల వ్యాధుల్నించి ఉపశమనం కలుగుతుంది.

Also read: Almond Benefits: వేసవిలో బాదం ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది, కలిగే ప్రయోజనాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News