Diabetic Patients: డయాబెటిక్ నొప్పులు బాధిస్తున్నాయా..ఈ రెండు చిట్కాలు ట్రై చేయండి
Diabetic Patients: మధుమేహం. అత్యంత ప్రమాదకరవ్యాధి. నియంత్రణే తప్పు పరిష్కారం పూర్తిగా లేదు. డయాబెటిస్ కారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో మార్పులు వస్తుంటాయి. ఇందులో ఒకటి చేతుల నొప్పి కూడా..
Diabetic Patients: మధుమేహం. అత్యంత ప్రమాదకరవ్యాధి. నియంత్రణే తప్పు పరిష్కారం పూర్తిగా లేదు. డయాబెటిస్ కారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో మార్పులు వస్తుంటాయి. ఇందులో ఒకటి చేతుల నొప్పి కూడా..
దేశంలో డయాబెటిస్ అనేది చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రతి పదిమందిలో ఒకరికి ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు వైద్య నిపుణులు. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, లైఫ్‌స్టైల్ కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. పూర్తి చికిత్స లేదు కాబట్టి..ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో లేకపోతే వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే..చేతులు, కాళ్లలో తరచూ నొప్పులు వస్తుంటాయి. మీకు కూడా చేతుల నొప్పి సమస్య ఉంటే బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడం మంచిది. డయాబెటిస్ రోగుల్లో చేతుల నొప్పులకు ఏం చేయాలో తెలుసుకుందాం..
మధుమేహం వల్ల మీకు చేతి నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్ట్రెచింగ్ చేయడం మంచి ప్రత్యామ్నాయం. దీనివల్ల మాంసకృతుల్లో రిలాక్సేషన్ వస్తుంది. స్ట్రెచింగ్ చేయడం వల్ల కాళ్ల నొప్పుల్నించి ఉపశమనం పొందవచ్చు. ఇక మరో విధానం కోల్డ్ థెరపీ. డయాబెటిస్ రోగుల్లో కన్పించే చేతి నొప్పుల్నించి ఉపశమనం పొందేందుకు కోల్ట్ థెరపీ చేయాలి. దీనికోసం దాదాపు 10-15 నిమిషాలు ఐస్ ముక్కల్ని ఓ వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టాలి. ఫలితంగా నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.
చేతులు, కాళ్ల నొప్పి సమస్యల్ని తగ్గించేందుకు ఎప్పుడూ హెల్తీ డైట్ ఎంచుకోవాలి. మరోవైపు ధూమపానం, మద్యం నుంచి దూరంగా ఉండాలి. కీళ్ల నొప్పుల్నించి ఉపశమనం పొందేందుకు ఏరోబిక్స్ అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. డయాబెటిస్ కారణంగా నొప్పులుంటే మాత్రం ఇదే మంచి ప్రత్యామ్నాయం.
Also read: Sravana Somavaram vratam: శ్రావణ సోమవారం వ్రతంలో తీసుకోవల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఇవే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook