Cholesterol Tips: శరీరంలో ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ చాలా కీలకమైంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిందంటే ప్రాణాంతక వ్యాధులు ఎదురుకావచ్చు. అందుకే కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అందుకే కొన్ని రకాల ఆహార పదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cholesterol Tips: చెడు కొలెస్ట్రాల్ కారణంగా సీరియస్ వ్యాధులు ఎదురౌతాయి. ఆధునిక జీవన విధానంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ వంటి చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోతోంది. ఈ సమస్య ఎక్కువకాలం ఉంటే గుండె పోటు సమస్యలు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు పెరుగుతోంది. అందుకే ఈ సమస్య ఉన్నప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. మందులతో కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంచవచ్చు. అదే సమయంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా అవసరం. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఏ ఆహార పదార్ధాలు తినకూడదో హార్వర్డ్ యూనివర్శిటీ ఓ జాబితా విడుదల చేసింది. 


రెడ్ మీట్


బీఫ్, పోర్క్‌లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. హ్యామ్ బర్గర్, పోర్క్ చాప్‌లో పెద్దమొత్తంలో ఫ్యాట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండే రోగులకు మంచిది కాదు. అందుకే మటన్, బీఫ్ వంటివాటికి దూరంగా ఉండాలి. 


ఫ్రైడ్ ఫుడ్స్


ఆనియన్ రింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి డీఫ్ ఫ్రైడ్ పదార్ధాల వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఎందుకంటే డీప్ ఫ్రైడ్ పదార్ధాల్లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆలివ్ ఆయిల్ అనేది మంచి ప్రత్యామ్నాయంగా చెబుతారు. 


ప్రోసెస్డ్ మటన్ కూడా మంచిది కాదు. బేకరీ ఫుడ్స్‌లో ఫ్యాట్ పరిమాణం చాలా ఎక్కువ. వీటిసలో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినాలనే కోరిక ఉంటే మటన్ బదులు చికెన్ తీసుకోవడం మంచిది. అయితే చికెన్ కూడా పరిమితంగానే తీసుకోవాలి. కుకీస్, పేస్ట్రీ , పిజ్జా, బర్గర్ వంటి పదార్ధాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. వీటివల్ల కొలెస్ట్రాల్ పెద్దమొత్తంలో చేరుతుంది.


Also read: Immunotherapy: కేన్సర్ చికిత్సకు అద్భుతంగా పనిచేస్తున్న ఇమ్యునోథెరపీ, ఎలా పనిచేస్తుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook