కిడ్నీ అనేది మనిషి శరీరంలో ఫిల్టర్ లాంటిది. శరీరంలోని వ్యర్ధాల్ని వడపోసి విష పదార్ధాల్ని తొలగిస్తుంది. ఫలితంగా పలు వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యం చాలా ముఖ్యం. కిడ్నీ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైంది. కిడ్నీలో రాళ్లు, ఇన్‌ఫెక్షన్ వంటివి లేకుండా చూసుకోవాలి. కిడ్నీ వ్యాధులుంటే తీవ్ర పరిస్థితులు ఎదురౌతాయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడైనా అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. క్రమం తప్పకుండా అదే పనిగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ సమస్య వెంటాడుతుంది. అందుకే కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.


సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి కావంటారు. ఇది నిజం కూడా. కానీ అన్ని పండ్లు మంచివని చెప్పలేం. కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నప్పుడు పండ్ల తినేవిషయంలో కొన్ని పరిమితులున్నాయి. కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు మాత్రమే ఆరోగ్యానికి మంచివి. ఉదాహరణకు కొబ్బరి కాయలు, పుచ్చకాయ, దోసకాయ వంటివి ఉపయోగకరం. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. ఎందుకంటే ఇవి కిడ్నీ సమస్యను దూరం చేయడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఆరెంజ్, బత్తాయి, ద్రాక్ష తినవచ్చు.


కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా ఐదు రకాల పండ్లు అస్సలు తినకూడదు. ఇందులో దానిమ్మ, జామ, డ్రై ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ ఉన్నాయి.


Also read: Diet For Diabetes: ఎలాంటి ఖర్చులేకుండా మధుమేహానికి ఇలా చలి కాలంలో 10 రోజుల్లో గుడ్‌బై చెప్పండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook