Lungs Health Signs: ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఏ లక్షణాలు కన్పిస్తాయి
Lungs Health Signs: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి ఊపిరితిత్తులు. గుండె, కిడ్నీలు, లివర్ ఎంత ముఖ్యమో ఊపిరితిత్తులు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. అందుకే ఊపిరితిత్తులు ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం.
Lungs Health Signs: మనిషి శరీరంంలో ఉండే ప్రతి అవయవం పనితీరు సక్రమంగా ఉన్నంతవరకూ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. అదే ఏమైనా సమస్య తలెత్తితే మాత్రం వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటుంది. ఆ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స చేయించగలిగితే చాలా వరకూ పరిస్థితి అదుపులో ఉంటుంది.
అదే విధంగా మనిషి శరీరంలో అతి ముఖ్యంగా పరిగణించే ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేకపోతే కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే శ్వాసకోశాలు దెబ్బతిని ప్రాణాంతకం కాగలదు. ముఖ్యంగా శ్వాస సరిగ్గా ఆడకపోవడం ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఊపిరితిత్తుల్లో కణితి, గాలి మార్గాన్ని అడ్డుకునే కార్సినోమాలో ద్రవం ఏర్పడటం వంటి సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే శ్వాసకు సంబంధించి ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే ఛాతీ నొప్పి మరో లక్షణంగా ఉంటుంది. ఛాతీలో సూదులు గుచ్చినట్టుండటం, నీరసం వంటివి కన్పిస్తాయి. ఈ లక్షణాలు కొన్ని వారాలు, నెల కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలిగితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. నిద్రపోయేటప్పుడు గురక అనేది మంచి అలవాటు కాదు. శ్వాసకోశాల ఆరోగ్యం సరిగ్గా లేనట్టే అర్ధం. ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాల్లో ఏదైనా అవరోధం ఏర్పడినా లేదా ఆ నాళాలు సంకోచించినా గురక వస్తుంది.
అంటు వ్యాధులు లేదా ఇన్‌ఫెక్షన్ ఉంటే కఫం లేదా శ్లేషం వస్తుంది. ఈ పరిస్థితి నెలరోజులు దాటి ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం కావచ్చు. వెంటనే పల్మోనాలజిస్ట్‌ను కలవాల్సి ఉంటుంది. అదే పనిగా దగ్గు బాధిస్తుంటే నిర్లక్ష్యం వహించకూడదు. ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి కారణాలతో కూడా దగ్గు వెంటాడుతుంది. ఒక్కోసారి దగ్గు తీవ్రమైతే రక్తం కారవచ్చు. దగ్గు అదే పనిగా వెంటాడితే వెంటనే వైద్యుని చూపించుకోవాలి.
మీ శరీరంలోని శ్వాస వ్యవస్థ పనితీరును కొన్ని అలవాట్లు దెబ్బతీస్తాయి. స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. లంగ్స్ కేన్సర్, క్రానిక్ అబ్స్టక్టివ్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ బ్రాంకైటిస్ వంటి రోగాలు ప్రాణాంతకం కావచ్చు.
Also read: Winter Hydration Tips: చలికాలంలో డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఏం చేయాలి, ఎందుకీ సమస్య వస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook