Winter Hydration Tips: చాలామంది అనుకున్నట్టు డీ హైడ్రేషన్ సమస్య కేవలం వేసవి కాలంలో ఎదురయ్యే సమస్య కాదు. చలికాలంలోనే ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం దప్పిక లేని కారణంగా నీళ్లు తాగడం తగ్గించేస్తుంటాం. అదే ఈ సమస్యకు కారణమౌతుంది.
నీరు అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగమని చెప్పాలి. నీరు లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. మనిషి శరీరంలో 70 శాతం నీళ్లే ఉంటాయి. అందుకే రోజుకు 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగమని సూచిస్తుంటారు వైద్యులు. వేసవికాలంలో తాగగలం గానీ చలికాలంలో ఇంత నీరు తాగలేకపోతుంటాం. అలసట, దాహం లేకపోవడంతో సహజంగానే చలికాలంలో నీళ్లు తాగడం తగ్గిచేస్తుంటాం. దాంతో శరీరంలో డీ హైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడే ఈ సమస్య ఏర్పడుతుంది. డీ హైడ్రేషన్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడికి లోనవడం, చికాకు, విసుగు, అశాంతి, మలబద్ధకం, తలతిరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తాగాలి.
భోజనం లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీటి కొరతను దూరం చేయవచ్చు. సాధారణ నీళ్లే కాకుండా నిమ్మకాయ నీళ్లు కూడా తాగవచ్చు. నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో గదిలోపలి వాతావరణం కూడా తేమగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో తేమ కూడా హైడ్రేట్‌గా ఉంచేందుకు దోహదమౌతుంది. అంటే హ్యుమిడిటీ లేకుండా చూసుకోవాలి.
బాడీని హైడ్రేట్‌గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతుండాలి. రోజంతా ఎంత నీళ్లు తాగుతున్నారనేది చూసుకోవాలి. వీలైతే బాటిల్ నీళ్లు తీసుకుని అందులోంచి తాగడం ద్వారా ఎంత నీళ్లు తాగుతున్నారో తెలుసుకునేందుకు వీలవుతుంది. కెఫీన్ లేని వేడి పానీయాలు డైట్‌లో భాగంగా చేసుకోవాలి. హెర్బల్ టీ, గోరు వెచ్చని నీళ్లు వంటివి తీసుకుంటే మంచిది.
చర్మం ద్వారా కూడా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు. చర్మాన్ని మాయిశ్చరైజర్ చేయడం ద్వారా శరీరంలో నీళ్లు స్థిరంగా ఉండేట్టు చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాగే నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉండేట్టు చూసుకుంటే ఇంకా మంచిది. పాలు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేట్‌గా ఉంచవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు సూప్ వంటివి తీసుకుంటే ఆరోగ్యమే కాకుండా హైడ్రేట్‌గా ఉండేందుకు వీలవుతుంది. అవకాడో, నేరేడు, టొమాటో వంటివి డైట్‌లో ఉంటే చాలావరకూ డీ హైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook