ప్రస్తుతం చాలామందికి ఉన్న ప్రధాన సమస్య ఇదే. మూడాఫ్ లేదా మూడ్ స్వింగ్ సమస్య. మూడ్ స్వింగ్‌కు కచ్చితమైన కారణాలేంటనేది ఎవరికీ తెలియదు. మూడాఫ్ అయినప్పుడు ఏం చేయాలో కూడా అర్ధం కాదు. ఈ సమస్యకు కారణాలేంటి, ఎలా ఉపశమనం పొందాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడాఫ్ సమస్యకు పోషక పదార్ధాలు కూడా ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పోషక పదార్ధాల లోపం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే మనం తినే ఆహారంలో పోషక పదార్ధాలుండేట్టు చూసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మూడాఫ్ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో ఆ వివరాలు మీ కోసం..


మూడాఫ్ సమస్యను ఎలా దూరం చేయాలి


పాలకూర


పాలకూర శరీరానికి చాలా మంచిది. పాలకూర తినడం వల్ల మూడాఫ్ సమస్య సులభంగా పరిష్కరించవచ్చు. పాలకూరలో ఉండే ఐరన్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఇందుకు దోహదపడతాయి. రోజూ పాలకూర తినడం అలవాటు చేసుకుంటే..మూడాఫ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 


పర్మంటెడ్ పుడ్స్


పర్మంటెడ్ ఆహార పదార్ధాలు తినడం వల్ల జీర్ణక్రియ పటిష్టంగా ఉంటుంది. రోజూ ఈ రకమైన పదార్ధాలు కనీసం రోజు విడిచి రోజు తీసుకుంటున్నా మూడాఫ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పర్మంటెడ్ ఆహార పదార్ధాల్లో పెరుగు, కివీ, ఇడ్లీ తప్పకుండా సేవించాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. 


ప్రోటీన్లు


ప్రోటీన్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ప్రోటీన్లను డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరం పటిష్టంగా తయారవడమే కాకుండా మూడాఫ్ సమస్య కూడా పోతుంది. మూడాఫ్ సమస్య దూరం చేసేందుకు ఎగ్స్, బ్రోకలీ, సోయాబీన్, పెసరపప్పు డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది.


Also read: Weight Loss Tips: క్యారెట్ రసంతో బెల్లీ ఫ్యాట్‌, శరీర బరువు 12 రోజుల్లో కరగడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook