Rice - Roti - Weight Gain: అన్నం, రోటీ మానేస్తే బరువు తగ్గుతారా..? ఇది ఎంత వరకు నిజం..?
Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో బరువు తగ్గించడం ప్రధాన సమస్యగా మారుతోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే బరువు తగ్గించుకోవడం పెద్ద సమస్యేమీ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.
Rice and Roti Increases Weight ?: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం పెను సమస్యగా మారుతోంది. సరైన డైట్ లేకపోవడం, పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి చాలా కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో బరువు తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు విఫలమౌతుంటే ఆందోళన చెందవద్దు. కొన్ని సూచనలు పాటిస్తే తప్పకుండా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు డైటిషియన్లు.
బరువు తగ్గించుకోవడం అనేది అంత సులభం కాదు. దీనికోసం హెవీ వర్కవుట్స్, డైట్ ఫాలో కావల్సి ఉంటుంది. కడుపు, పొట్ట చుట్టూ కొవ్వు కరిగించేందుకు చాలామంది అన్నం, రోటీ మానేస్తుంటారు. బరువు తగ్గించుకునేందుకు ఇది సరైన విధానమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలా అన్నం లేదా రోటీ మానేయడం వల్ల ప్రయోజనం ఉందా లేదా, సాధ్యాసాధ్యాలేంటో తెలుసుకుందాం..
అన్నం, రోటీలో లభ్యమయ్యే కేలరీలు:
అధిక బరువు నియంత్రణ కోసం ఎప్పుడైతే అన్నం, రోటీ మానేస్తామో సహజంగానే ఫ్రూట్స్, సలాడ్ వంటివాటిపై ఆధారపడాల్సి వస్తుంది. రోటీలో దాదాపు 140 కేలరీలుంటాయి. అదే సగం గిన్నె అన్నంలో 140 కేలరీలుంటాయి. అంటే అన్నం లేదా రోటీ తినడం వల్ల మీ కేలరీలపై పెద్దగా ప్రభావం పడదు. అన్నం ఎంత తింటున్నామనేదానిపైనే కేలరీలు ఆధారపడి ఉంటాయి.
Also Read: Green Tea: గ్రీన్ టీని అతిగా తాగితే ఈ సమస్యలు తప్పవు, రక్తహీనత కూడా రావొచ్చు!
బరువు పెరగడం ఆరోగ్యానికి ప్రమాదకరం:
బరువు పెరుగుతుండటం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా నష్టం వాటిల్లుతుంది. బరువు పెరిగేకొద్దీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ తరువాత డయాబెటిస్ సమస్య తలెత్తుతుంది. దాంతోపాటు నాళికల్లో ప్లక్ పేరుకుపోవడం వల్ల బ్లాకేజ్ ఏర్పడుతుంది. అదే జరిగితే అధిక రక్తపోటు సమస్య ఉత్పన్నమై..హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసల్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే ఆహారపు అలవాట్లపై నియంత్రణ చాలా అవసరం. బరువు తగ్గించుకోవాలంటే ఇదొక్కటే అత్యుత్తమ మార్గం.
ఏ రోటీలు తినాలి..?
బరువు తగ్గించుకోవాలంటే గోధుమల రోటీ కంటే మల్టీగ్రెయిన్ పిండి వాడటం మంచిది. ఇందులో మొక్కజొన్నలు, బాజ్రా, జొన్న, రాగి, శెనగలు, ఓట్స్ ఉంటాయి. ఇందులో చెప్పుకోదగ్గస్థాయిలో అంటే చాలా తక్కువ మోతాదులో కేలరీలుంటాయి. బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
వైట్ రైస్ లేదా రిఫైన్ రైస్ బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. దీని స్థానంలో బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైల్డ్ రైస్ వాడటం మంచిది.
Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్, బీపీకి శాశ్వతంగా చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook