Diabetes Diet: మదుమేహం వ్యాదిగ్రస్థులకు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి
Diabetes Diet: మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. మధుమేహం ఎంత ప్రమాదకరమైనదైనా..ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
Diabetes Diet: మధుమేహం ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లు పూర్తిగా నియంత్రణలో ఉండాలి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా రోజువారీ జీవితం ప్రారంభమయ్యే బ్రేక్‌ఫాస్ట్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.
ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, చెడు జీవనశైలి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైంది డయాబెటిస్. ఒకసారి సోకిందంటే జీవితాంతం వదలదు. నియంత్రణ మాత్రమే సాధ్యం. మరీ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జీవనశైని క్రమబద్ధీకరించుకోవాలి. జంక్ ఫుడ్స్, ఫాస్త్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. చాలామంది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే ఉద్దేశ్యంతో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. ఇది మరీ ప్రమాదకరం. పండ్ల జ్యూస్ కంటే పండ్లు తినడం మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు తీసుకోవడం అత్యుత్తమం. పండ్లలో ఉంటే ఫైబర్ కంటెంట్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉంటాలి. అయితే సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ ఉండే గోధుమలు, ఓట్స్ , బార్లీ వంటివి తీసుకోవచ్చు. అంటే పాలిష్ చేయని ఈ పదార్ధాలు కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా విడుదల చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. చాలామంది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే కారణంతో ప్రోటీన్ ఫుడ్‌కు దూరంగా ఉండారు కానీ ఇది మంచి పద్ధతి కాదు. మాంసం, చేపలు, బీన్,్ పప్పు ధాన్యాలు, గింజలు వంటి పదార్ధాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందడమే కాకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల స్థూలకాయం, గుండె వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
Also read: Adrenal Fatigue: అడ్రినల్ ఫ్యాటిగ్ అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook