Breakfast Diet: శరీరంలో అంతర్గతంగా సంభవించే పలు మార్పులు వివిధ లక్షణాలతో బయటపడుతుంటాయి. కొన్ని రకాల పోషకాలు శరీరానికి అందకపోతే అనారోగ్యం ఎదురౌతుంది. అందుకే రోజూ తప్పకుండా తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్ చాలా హెల్తీగా ఉండటం అవసరం. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యం మహా భాగ్యం. ఆరోగ్యం ఉండాలంటే ఆహార పదార్ధాలు, జీవన శైలి రెండూ బాగుండాలి. ఈ రెండూ బాగున్నంతవరకూ ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి రోజు ప్రారంభమయ్యేది బ్రేక్‌ఫాస్ట్‌తో. అందుకే బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా బాగుండాలి. మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ను బట్టి ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తినవచ్చు, ఏది తినకూడదు, ఏది తప్పకుండా తినాలనే సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలను బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కారణం ఈ పదార్ధాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ సమయంలో తీసుకున్న ప్రతి ఆహారం నేరుగా లోపలి భాగాలపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. 


ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడని పదార్ధాలు


ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ రూపంలో మసాలా లేదా ఫ్రైడ్ పదార్ధాలు తినకూడదు. వీటివల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పిస్తుంది. ఫైబర్ పదార్ధాలు మంచివే కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం కలుగుతుంది. కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 


ఇక చాలామందికి రోజూ బెడ్ మీంచి లేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ ఇదొక చెడు అలవాటు. రోజూ పరగడుపున టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడతాయి. ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీరు అస్సలు తాగకూడదు. లేకపోతే అసలుకే మోసమొస్తుంది. 


ఇంకొంతమంది ముఖ్యంగా మందుకు బానిసలైన వాళ్లు లేదా మోడ్రన్ లైఫ్ లేదా రిచ్ లైఫ్ ముసుగులో ఉండేవాళ్లు ఉదయం పరగడుపునే ఆల్కహాల్ సేవిస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఈ అలవాటు నేరుగా లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. 


అందుకే ప్రతిరోజూ ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ చాలా హెల్తీగా ఉండాలి. అదే సమయంలో బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ మిస్సవకూడదు. నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. బ్రేక్‌ఫాస్ట్ మిస్సవకూడదు. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి. 


Also read: Weight loss Tips: ఈ నీళ్లు క్రమం తప్పకుండా రోజూ తాగితే నెలరోజుల్లోనే అధిక బరువుకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook