Cholesterol Lowering Foods: కొలెస్ట్రాల్ ఒక్కటే అన్ని సమస్యలకు కారణమా
Cholesterol Lowering Foods: శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చాలా కారణాలుండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cholesterol Lowering Foods: చెడు కొలెస్ట్రాల్ లేక ఎల్‌డీఎల్ పెరగడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిత్య జీవితంలో తరచూ కన్పించే వివిధ రకాల రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులకు కారణం ఇదే. అంటే కొలెస్ట్రాల్ కారణంగా ప్రమాదకర వ్యాధులు తలెత్తుతాయి.
ఆధునిక జీవన విధానంలో అన్‌హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ప్రధానంగా కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా కన్పిస్తుంది. జంక్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. ఇది ఎంత ప్రమాదకరమంటే నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ తక్షణం నియంత్రించాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించగలిగితే గుండె వ్యాధుల ముప్పు కూడా తగ్గిపోతుంది. దీనికోసం డైట్ కొద్దిగా మార్చాల్సి ఉంటుంది.
పండ్లు కూరగాయలు
పండ్లు కూరగాయలు డైట్‌లో రోజూ ఉండేట్టు చూసుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. పండ్లు, కూరగాయల్లో కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాకుండా విటమిన్లు, ఫైబర్, ఆంటీ ఆక్సిజెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
పాప్ కార్న్
చాలామంది పిల్లలు, యూత్ ఇష్టంగా తినే బెస్ట్ టైమ్‌పాస్ ఫుడ్ పాప్‌కార్న్. పాప్‌కార్న్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు పాప్‌కార్న్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం ఇతర పోషకాలు చాలా ఉంటాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో వస్తాయి.
నట్స్ అండ్ ఫ్రూట్స్
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించేందుకు నట్స్ అండ్ ఫ్రూట్స్ చాలా కీలకపాత్ర పోషిస్తాయి. దీనికోసం కేవలం బాదం, జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే కాకుండా వాల్ నట్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. వాల్‌నట్స్ లోపల ప్రోటీన్లు, ఫైబర్ రెండూ ఉంటాయి. డైట్‌లో వాల్‌నట్స్ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ వేగంగా తగ్గుతాయి.
Also read: Flipkart mobile Offers: ఐఫోన్ 15 ప్రో పై ఊహించని డిస్కౌంట్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook