Diet for Reduce Risk of Heart Attack: ఆధునిక జీవనశైలిలో తలెత్తే వివిధ రకాల వ్యాధుల్లో అత్యంత కీలకమైంది కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగే కొద్దీ గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చాలామార్గాలున్నా..ప్లాంట్ ఆధారిత డైట్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జీవనశైలి కారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. ఒక్కోసారి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటాం. అయితే ఇప్పుడిది పెద్ద సమస్య కానేదు. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం బాదం, సోయా బీన్స్, పప్పులు, చిక్కుడు, బీన్స్, గోరుచిక్కుడు, బొబ్బర్లు వంటి ప్లాంట్ ఆధారిత డైట్‌తో అధిక రక్తపోటు, ట్రై గ్లిసరాయిడ్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.


ప్లాంట్ ఆధారిత ఆహార పదార్ధాలను తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్ధాలతో తినడం వల్ల లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్‌లో 30 శాతం తగ్గుదల కన్పిస్తుంది. దీంతో పాటు గుండెపోటు వంటి వ్యాధుల ముప్పు 13 శాతం వరకూ తగ్గిపోతుంది. కెనడాలోని టొరంటో యూనివర్శిటీ పరిశోధకుల ప్రకారం పోర్ట్ ఫోలియో డైట్ ద్వారా ఎల్‌డీఎల్ తగ్గించవచ్చు. కానీ దీనిపై స్పష్టమైన ఆధారాల్లేవు. 


ఈ అధ్యయనం డైట్ ప్రభావం, ఆరోగ్య సామర్ద్యం గురించి స్పష్టంగా ప్రామాణికంగా వివరించడమైంది. గుండెపోటు సంబంధిత సమస్యలపై ప్రచురితమైన ఓ వ్యాసంలో కూడా 400 మంది రోగుల్లో ముప్పు తగ్గినట్టు తేలింది. అధిక రక్తపోటు ముప్పు 2 శాతం, స్వెల్లింగ్ ముప్పు 31 శాతం తగ్గిందని తేలింది. ఆహార పదార్ధాలు, జీవనశైలిలో మార్పు ద్వారా రోగి హై కొలెస్ట్రాల్ , గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గించవచ్చు. 


Also Read: Protein Rich foods: ప్రోటీన్లు కేవలం మాంసాహారంలోనే కాదు..ఈ కూరగాయలు తింటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook