Dengue Threat: సీజనల్ వ్యాధులు ఎక్కువగా వర్షకాలంలోనే తలెత్తుతుంటాయి. వర్షాకాలం రాగానే ఎండల్నించి ఉపశమనం లభిస్తుంది. కానీ అదే సమయంలో వివిధ వ్యాధులు పీడిస్తుంటాయి. ఎందుకంటే 80 శాతం వ్యాధులకు కారణం నీళ్లే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలంలో తలెత్తే వివిధ రకాల వ్యాధుల్లో డెంగ్యూ అతి ముఖ్యమైంది, అతి ప్రమాదకరమైంది కూడా. వర్షాకాలంలో ఎక్కువగా కన్పించే డెంగ్యూ ఎంత ప్రమాదకరమైందంటే చాలా సందర్భాల్లో ప్రాణాలు పోతుంటాయి. మనిషిని నిట్టనిలువునా కుశించేలా చేస్తుంది. దోమకాటుతో వ్యాపించే ఈ వ్యాధితో చాలా అప్రమత్తంగా ఉండాలి. డెంగ్యూ అనేది ఓ ప్రమాదకరమైన వ్యాధి. ఎడిస్ ఎజిప్ట్ జాతికి చెందిన దోమ కారణంగా డెంగ్యూ వ్యాధి వస్తుంది. డెంగ్యూ ఉన్నప్పుుడు తీవ్రమైన జ్వరం, ర్యాషెస్, తలనొప్పి, విపరీతమైన నీరసం ఉంటాయి. డెంగ్యూ సోకితే ప్లేట్‌లెట్ కౌంట్స్ గణనీయంగా తగ్గిపోతుంటాయి. మనిషి బలహీనంగా ఉండి ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతుంటే ప్రమాదకరంగా మారవచ్చు.


తీవ్రమైన జ్వరం, బాడీ పెయిన్స్, వాంతులు, శరీరంపై రెడ్ ర్యాషెస్, కళ్లలో నొప్పి,  గ్లాండ్స్ స్వెల్లింగ్, తీవ్రమైన అలసట, ముక్కు లేదా చిగుళ్లలో రక్తం కారడం డెంగ్యూ లక్షణాలుగా ఉన్నాయి.


డెంగ్యూ నుంచి రక్షించుకోవాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. రాత్రిళ్లు దోమల్లేకుండా చూసుకోవాలి. బట్టలు పూర్తిగా కప్పుకునేట్టు ఉంటే మంచిది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాగింగ్ తప్పనిసరిగా చేయాలి. నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడటం మంచిది.


డెంగ్యూ లక్షణాలు కన్పించినప్పుడు తక్షణం వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్లేట్‌లెట్స్ కౌంట్ పరీక్షించుకోవాలి. ప్లేట్‌లెట్ కౌంట్ 20 వేలకు తగ్గకుండా చూసుకోవాలి. 20 వేలకు తగ్గితే మాత్రం ప్లేట్‌లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. అదే సమయంలో బొప్పాయి ఆకుల రసం ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పెరిగేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉదయం సాయంత్రం రోజుకు రెండుసార్లు 4-5 ఎంఎల్ బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది.


Also read: Detox Signs: శరీరాన్ని డీటాక్స్ ఎప్పుడు చేయాలో ఎలా తెలుస్తుంది, డీటాక్స్ లక్షణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook