Detox Signs: శరీరాన్ని డీటాక్స్ ఎప్పుడు చేయాలో ఎలా తెలుస్తుంది, డీటాక్స్ లక్షణాలేంటి

Detox Signs: క్లీనింగ్ అనేది కేవలం బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా చాలా అవసరం. శరీరంలోపలుండే వ్యర్ధాలను ఎప్పటికప్పుుడు క్లీన్ చేస్తుంటే ఆరోగ్యం ఉంటుంది. లేకపోతే వివిధ రకాల సమస్యలు చుట్టుముడతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2023, 12:26 AM IST
Detox Signs: శరీరాన్ని డీటాక్స్ ఎప్పుడు చేయాలో ఎలా తెలుస్తుంది, డీటాక్స్ లక్షణాలేంటి

Detox Signs: శరీరంలోపల వివిధ రకాల వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. ఈ వ్యర్ధాల్ని తొలగించి క్లీన్ చేయడాన్నే డీటాక్స్ అంటారు. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తుండాలి. ఇది చాలా అవసరం అసలు డీటాక్స్ ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలనేది తెలుసుకుందాం..

ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం తగ్గిపోయింది. ఫాస్ట్‌ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుండటం వల్ల జీర్ణం కాని ఆహారమంతా శరీరంలో వ్యర్ధాలుగా, మలినాలుగా పేరుకుపోతుంటాయి. ఇది చాలా ప్రమాదకరం. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఈ వ్యర్ధాల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈ వ్యర్ధాలను శుభ్రం చేయడాన్నే డీటాక్స్ అంటారు. మరి ఇప్పుడు డీటాక్స్ ఎప్పుడెప్పుడు చేయాలనే సందేహం వస్తుంది. శరీరంలో విషపదార్ధాలు ఎక్కువైనప్పుడు మీ శరీరం అందుకు సంబంధించిన సంకేతాలు వెలువరిస్తుంది. 

శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయినప్పుడు నోటి నుంచి దుర్వాసన, శరీరంపై చెమట చెడు వాసన వస్తుంటుంది. శరీరంలో చాలా రకాల విష పదార్ధాలు పేరుకుపోయినప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. అదే సమయంలో మీ శ్వాస కూడా చెడు వాసన కల్గిస్తుంది. ఈ లక్షణాలు కన్పిస్తే శరీరాన్ని డీటాక్స్ చేయాలని అర్ధం. ఇంకా చాలా లక్షణాల రూపంలో డీటాక్స్ చేయాల్సిన అవసరాన్ని శరీరం గుర్తు చేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఎందుకంటే ప్రేగుల్లో పేరుకున్న వ్యర్ధాలు, విష పదార్ధాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. 

ఇక మహిళల విషయంలో అదనంగా కొన్ని లక్షణాలుంటాయి. మహిళల్లో మూడ్ పాడవడం, చికాకు, పనిలో ఆసక్తి లేకపోవడం శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోవడం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే విష పదార్ధాలు శరీరం మెటబోలిజంను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ సమతుల్యత సరిగ్గా ఉండాలంటే..మెటబోలిజం కూడా సరిగ్గా ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో శరీరాన్ని డీటాక్స్ చేయాలి. చర్మ సంబంధిత సమస్యలు కూడా శరీరంలో వ్యర్ధాలకు కారణంగా ఉంటాయి. చర్మంపై ముడతలు, పింపుల్స్, మచ్చలు ఇందుకు కారణాలు. 

Also read: Sinus vs Cold: సైనస్‌ను ఎలా గుర్తించవచ్చు, సాధారణ జలుబుకు సైనస్‌కు తేడాలేంటి, లక్షణాలెలా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News