Diabetes Diet Fruits: మధుమేహం వ్యాధిగ్రస్థులు మామిడి పండ్లు తినవచ్చా లేదా
Diabetes Diet Fruits: డయాబెటిస్ సమస్య ఎంత తీవ్రమైందో అంతకంటే చికాకు కల్గించే విషయం ఆహారపు అలవాట్లు. ఏది తినవచ్చు , ఏది తినకూడదనే సందిగ్దం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ విషయంలో మరింత సమస్య తలెత్తుతుంటుంది. అందులో ఒకటి వేసవి రారాజు మామిడి పండు.
Diabetes Diet Fruits: మధుమేహం వ్యాధిగ్రస్థులకు వివిధ రకాల పండ్లు లేదా ఇతర పదార్ధాలు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. ప్రధానంగా వేసవి సీజనల్ ఫ్రూట్ మామిడి విషయంలో. ఎందుకంటే మామిడి పండంటే అందరికీ ఇష్టముంటుంది. డయాబెటిస్ కారణంగా మామిడిని దూరం చేసుకోలేరు. ఇంతకీ డయాబెటిస్ రోగులు మామిడి పండ్లు తినవచ్చా లేదా అనేది తెలుసుకుందాం..
మామిడిని పండ్ల రారాజుగా పిలుస్తారు. ఇది వేసవి సీజనల్ ఫ్రూట్. అత్యంత రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మామిడి పండ్లంటే ఇష్టపడనివారుండరు బహుశా. అయితే డయాబెటిస్‌తో బాధపడేవాళ్లు మామిడి పండ్లు తినవచ్చా లేదా , ఉపయోగకరమా, హానికరమా అనే మీమాంసలో ఉంటుంటారు. మామిడిని డయాబెటిస్ రోగులు పరిమితంగా తినవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పోషక గణాంకాల ప్రకారం 100 గ్రాముల మామిడిలో 15 గ్రాముల కార్బ్స్, 14 గ్రాముల పంచదార ఉంటుంది. అంటే కచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచేస్తుంది.
మామిడి బ్లడ్ షుగర్‌పై ప్రభావం చూపిస్తుందా
డయాబెటిస్ రోగులకు ఉత్పన్నమయ్యే వివిధ ప్రశ్నల్లో ముఖ్యమైంది మామిడి పండ్లు తినడం మంచిదా కాదా అనేది. దీనికి సమాధానం తినవచ్చనే చెప్పాలి. అయితే కేవలం పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. డయాబెటిస్ రోగులు 1-2 ముక్కల వరకే తినాలి. అంతకుమించి తినడం మంచిది కాదు. ఇతర పండ్లలో ఉన్నట్టే ఇందులో కూడా కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిని పెంచుతాయి. కానీ మామిడి పండ్లలో ఉండే ఫైబర్ పంచదారను గ్రహించుకుంటుంది. అంటే తిన్న తరువాత బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలోనే ఉంటాయి. అటు శాస్త్రవేత్తల ప్రకారం మామిడిలో మంచి పోషకాలు, తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ ఉంటాయి.
1. మామిడిని కట్ చేసి తినకూడదు. మామిడిని కట్ చేయడం వల్ల అందులో ఉండే షుగర్ లెవెల్స్ పెరిగిపోగలవు. అందుకే మామిడిని రసం పిండుకుని తినాలి.
2. మామిడి పండ్లు ఎక్కువగా తినకూడదు. ఎక్కువ తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిని తగ్గించవచ్చు.
3. మేంగో జ్యూస్‌లో పంచదార కలుపుకుని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇలా తాగడం ప్రమాదం. మేంగో జ్యూస్ తాగాలంటే నార్మల్‌గానే తాగాలి.
4. షుగర్ రోగులు సాధ్యమైనంతవరకూ పూర్తిగా పండింది కాకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నది తింటే మంచిది. ఎందుకంటే కొద్దిగా పచ్చిగా ఉంటే పంచదార శాతం తక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.
Also read: Weight Loss Tips: అన్నం, రోటీ మానేస్తే బరువు తగ్గడం ఎంతవరకూ నిజం, ఈ చిట్కాలు పాటించండి
5. డయాబెటిస్ రోగులు ఉదయం వాకింగ్ తరువాత లేదా వ్యాయామం తరువాత లేదా భోజనం చేసేటప్పుడు మామిడి పండు తినడం అనువైన సమయం. నిపుణుల సలహా ప్రకారం..భోజనం మధ్యలో మామిడి పండు తినడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
6. మామిడి పండ్లతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పెరుగు, పన్నీర్ లేదా చేపలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు దోహదమౌతుంది.
Also read: Strong Bones: ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా, ఈ పండ్లు రోజూ తీసుకుంటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook