Strong Bones: ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా, ఈ పండ్లు రోజూ తీసుకుంటే చాలు

Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 05:45 PM IST
Strong Bones: ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా, ఈ పండ్లు రోజూ తీసుకుంటే చాలు

Strong Bones: మనిషి శరీరంలోని ఎముకలు, కండరాలు బలంగా ఉండాలంటే కాల్షియం, కొన్ని రకాల విటమిన్లు తప్పనిసరి. సాధారణంగా వయస్సుతో పాటు ఎముకలు బలహీనపడుతుంటాయి. కానీ ఇటీవలి కాలంలో వివిధ రకాల జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య వచ్చి పడుతోంది. కాల్షియం, విటమిన్ సి లోపాన్ని సరిజేసేందుకు ఈ పండ్లు తప్పకుండా తీసుకోవాలి.

వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా బలంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ సి చాలా అవసరం. ఇవి లోపిస్తే కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ సమస్య వెంటాడుతుంది. కొన్ని పండ్లు డైట్‌లో క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల సమస్య తలెత్తదు. కాల్షియం, విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు కూడా కావల్సిన పరిణామంలో లభిస్తాయి. ఎందుకంటే పండ్లు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఎముకల్ని పటిష్టం చేస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే యాపిల్, స్ట్రా బెర్రీ, బొప్పాయి, పైనాపిల్, ఆరెంజ్, బనానా, కివీ పండ్లు సేవించాలి.

బొప్పాయి పైనాపిల్

బొప్పాయిలో పోషక పదార్ధాలు చాలా ఉన్నాయి. ఎముకలకు కావల్సిన కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. అటు పైనాపిల్‌లో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల సమస్యలకు అద్భుతంగా పరిష్కారం చూపిస్తుంది. పొటాషియం అనేది ఎముకల్లో కాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది. అందుకే పైనాపిల్ క్రమం తప్పకుండా సేవిస్తే ఎముకలకు సంబంధించిన చాలా సమస్యలు దూరమౌతాయి.

యాపిల్

ఎముకల సమస్య నుంచి విముక్తి పొందాలంటే యాపిల్ తరచూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. రోజుకు కనీసం ఒక యాపిల్ తింటే చాలా మంచిది. దీనివల్ల శరీరానికి కావల్సిన కాల్షియం, విటమిన్ సి లభిస్తుంది. ఈ రెండు పోషకాలు శరీరంలో కొలాజెన్ నిర్మాణం, ఎముకల కొత్త టిష్యూలు నిర్మాణంలో ఉపయోగపడతాయి. అందుకే యాపిల్ అనేది తప్పనిసరి. 

ఆరెంజ్, అరటి

ఎముకల్ని బలోపేతం చేసేందుకు ఆరెంజ్ అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం, విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుంది. అటు అరటి పండ్లలో కూడా కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల ఎముకల సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

స్ట్రా బెర్రీ

స్ట్రా బెర్రీపండ్లు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బలహీనంగా ఉన్న మీ ఎముకల్ని పటిష్టం చేస్తాయి. ఏ విధమైన సమస్యలు తలెత్తవు. 

Also read: Weight Loss Tips: అన్నం, రోటీ మానేస్తే బరువు తగ్గడం ఎంతవరకూ నిజం, ఈ చిట్కాలు పాటించండి

కివీ పండ్లు

కివీ పండ్లలో కాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఎముకలు వేగంగా ఎదిగేందుకు, పటిష్టంగా ఉండేందుకు దోహదపడుతుంది. కివీ పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియో పోరోసిస్ సమస్య దూరమౌతుంది.

Also read: Hair Care Tips: రోడ్లపై దొరికే ఈ పూలతో మీ జట్టు సహజసిద్ధంగా నల్లబడటం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News