Diabetes vs Stress: ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాపించే వివిధ రకాల వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్.  చెడు ఆహారపు అలవాట్లు, పని వేళలు, నిద్ర సరిగ్గా లేకపోవడం, పని ఒత్తిడి ఇలా అన్నీ మధుమేహం వ్యాధికి కారణమౌతున్న అంశాలు. వీటన్నింటితో పాటు మానసిక కారణాలు కూడా డయాబెటిస్ వ్యాధికి ప్రధాన కారణమని తాజా వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దైనందిన జీవితంలో వివిధ కారణాలతో ఒత్తిడి, ఆందోళన వెంటాడటం సహజంగా మారింది. పని వేళలు కావచ్చు, నిద్ర సరిగ్గా లేక పని ఒత్తిడి లేదా ఇతర కుటుంబపరమైన సమస్యలు ఇలా మానసికంగా పడే ఇబ్బందులు మధుమేహానికి దారితీస్తుంటాయి. మానసిక సమస్యల కారణంగా ఆందోళన, ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో చాలా హార్మోన్లు విడుదలౌతాయి. ఈ హార్మోన్స్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అమాంతం పెంచేస్తాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో ఇది ప్రతికూల ప్రభావం కల్గిస్తుంది. అయితే దీనిని నియంత్రించడం సాధ్యమేనంటున్నారు మానసిక వైద్యులు. ఒత్తిడి లేదా ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో కన్పించే ప్రతిక్రియల్ని ఫ్లైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ అని పిలుస్తారు. ఫలితంగా మీ రక్త సరఫరాలో అడ్రినలిన్, కార్టిసోల్ విడుదలౌతాయి. ఫలితంగా రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది. ఇది కాస్తా గ్లూకోజ్ స్థాయి పెరగడానికి దోహదపడుతుంది. అందుకే బ్లడ్ షుగర్ స్థాయి ఎక్కువగా ఉండేవారికి ఒత్తిడి, ఆందోళన మంచివి కావు.


స్ట్రెస్ అనేది వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మానసిక ఒత్తిడికి లోనయినప్పుడు సహజంగానే బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది.టైప్ 1 డయాబెటిస్ వ్యక్తుల్లో రెస్పాన్స్ విభిన్నంగా ఉంటుంది. అంటే గ్లూకోజ్ స్థాయి పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ పెరగవచ్చు.


స్ట్రెస్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై చూపించే ప్రభావం ఎలా తెలుస్తుంది


స్ట్రెస్ ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మధుమేహం పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. పని ఒత్తిడి కారణంగా సోమవారం వస్తే చాలు కొందరికి ఒత్తిడి పెరుగుతుంటుంది. దాంతో మీకు డయాబెటిస్ ఉంటే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకోవల్సి వస్తుంది. ఒత్తిడికి లోనైన ప్రతిసారీ డయాబెటిస్ చెక్ చేసుకుంటే రెండింటికీ ఉన్న సంబంధమేంటో తెలిసిపోతుంది. 


చాలా సందర్భాల్లో ఒత్తిడి లక్షణాలు సామాన్యంగానే ఉంటాయి. అది ఒత్తిడి అని కూడా మీకు అన్పించకపోవచ్చు. ఒత్తిడి అనేది మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని నష్టపరుస్తుంది. స్ట్రెస్ గుర్తించడం వల్ల నియంత్రించడంలో తోడ్పాటు లభిస్తుంది. 


తలనొప్పి, కండరాల్లో నొప్పి, ఎక్కువగా లేదా తక్కువగా నిద్ర పోవడం, అనారోగ్యంగా ఉన్నట్టుండటం, అలసట, నైరాశ్యం, విసుగు, అశాంతి అనేవి ఒత్తిడిలో కన్పించే ప్రదాన లక్షణాలు.


Also read: Weight Loss Diet Plan: బరువు తగ్గడానికి రోజు ఎన్ని కేలరీలు తగ్గించుకోవాలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook