Child Health Tips: ఇటీవలి కాలంలో పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల సమస్యగా మారుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఆహారపు ఆలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే. కొన్ని రకాల పోషకాల లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అందుకే డైట్‌లో ఈ ఆరు రకాల పోషకాలుంటే పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో ఇబ్బంది ఉండదంటున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక పోటీ ప్రపంచంలో లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. అంతా జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్‌పై ఆధారపడుతున్నారు. మరోవైపు శారీరక శ్రమ లేకపోవడం, మొబైల్ స్క్రీన్స్‌కు అలవాటు పడటం సాధారణమైపోయింది. ఫలితంగా పిల్లల్లో పోషకాహారం లోపిస్తోంది. నేటితరం పిల్లలు బయటకు వెళ్లి ఆడటమనేది దాదాపుగా కన్పించడం లేదు. ఇంట్లోనే ఉండటం, మొబైల్ లేదా ట్యాబ్స్‌కు అతుక్కుపోయి వీడియో గేమ్స్‌తో కాలక్షేపం చేయడం పరిపాటిగా మారిపోయింది. దీనికితోడు తినే తిండి కూడా సరిగ్గా ఉండటం లేదు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఫలితంగా నిశ్చలమైన జీవనశైలికి ఇంట్లో పిల్లలు సహా అంతా అలవాటుపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో శరీరానికి అవసరమైన పోషకాల లోపం వెంటాడుతోంది. 


పిల్లలకు పౌష్ఠికాహారం సరిగ్గా అందితే  మానసికంగా, శారీరకంగా ఎదుగుదల ఉంటుంది. ఇమ్యూనిటీ ఇతర ఆరోగ్య సమస్యల నివారణలో పోషకాహారం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే పిల్లలకు పౌష్టికాహారం తప్పకుండా ఇవ్వాలి. పిల్లలకు సాధ్యమైనంతవరకూ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం కలిగిన పండ్లు, కూరగాయలు, సీడ్స్, తృణధాన్యాలు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. 


మరో ముఖ్యమైన అంశం శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. అందుకే రోజుకు కనీసం 8-9 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగేట్టు అలవాటు చేసుకోవాలి. మీ శరీర వ్యవస్థను అందుకు సిద్ధం చేయాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, మల్బరీ, దోసకాయ, లిచీ, ద్రాక్ష పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా లభిస్తాయి. జంక్ ఫుడ్, ఫాస్డ్ ఫుడ్స్ , ప్యాకెట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.


మెదడు పనితీరు మెరుగుపర్చుకునేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరమౌతాయి. దీంతోపాటు మెగ్నీషియం, విటమిన్ బి అవసరం. వీటి కోసం ఫ్యాటీ ఫిష్ ఎక్కువగా తీసుకోవాలి. శాకాహారులైతే వాల్‌నట్స్, బాదం, చియా సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్, నెయ్యి మంచి ప్రత్యామ్నాయాలు. పిల్లల్లో దంతాలు, ఎముకల అభివృద్ధికి కాల్షియం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. దీనికోసం పాలు, వెన్న, పెరుగు తప్పకుండా ఇవ్వాలి. వీటికి తోడుగా ఉదయం సూర్యరశ్మి తగిలేట్టు చూడాలి. ఈ సూర్యరశ్మిలో ఎముకలకు బలాన్నిచ్చే విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. 


పిల్లల ఎదుగుదల, మానసిక వికాసం కోసం ఐరన్ చాలా అవసరమౌతుంది. ఐరన్ వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో ఉపయోగమౌతుంది. దీనికోసం మాంసం, చేపలు, బీన్స్, సీడ్స్ ఆకుకూరలు, నిమ్మకాయ, టొమాటో అద్భుతంగా ఉపయోగపడతాయి. శరీర నిర్మాణంలో అవసరమయ్యే విటమిన్ ఏ, బి, సి డి, ఇ, కే పుష్కలంగా లబించే క్యారెట్, సిట్రస్ ఫ్రూట్స్, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా పోషకాహారం సరిగ్గా ఉంటే పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. 


Also read: Healthy Liver Diet: డైట్ లో ఈ 5 పదార్ధాలు ఉంటే లివర్ ఎప్పటికీ పాడవదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook