Reduce Heart Attack: హార్ట్ ఎటాక్ ముప్పును దూరం చేసి.. మీ గుండెను పదిలంగా ఉంచే పద్ధతులు!
Healthy Heart: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో గుండె ఆరోగ్యానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Tips to Reduce Heart Attacks: దేశ వ్యాప్తంగా గుండె వ్యాధులు పెరుగుతున్నాయి. శరీరంలో అతి ముఖ్యమైన అంగమిది. గుండెను ఆరోగ్యంగా చూసుకున్నంతవరకే ప్రాణం నిలబడుతుంది. గుండె చప్పుడు విన్పించినంతవరకే మనిషి కదలిక ఉంటుంది. గత కొద్దికాలంగా యువకులు సైతం గుండెపోట్లకు గురై మరణిస్తున్నారు. మరి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలో పరిశీలిద్దాం..
వ్యాయామం:
మనిషికి శారీరక శ్రమ ఉండాల్సిందే. దీనికోసం ప్రతిరోజూ తప్పకుండా కనీసం ఓ అరగంట తేలికపాటు వ్యాయామం చేయాలి. వాకింగ్, రన్నింగ్, ఎక్సర్‌సైజ్ ఎలా చేసినా ఫరవాలేదు. ఇది తప్పనిసరి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అప్పటికే గుండె పోటు సమస్య ఉన్నవాళ్లు వ్యాయామం చేయకూడదు. అతిగా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
ఆకు పచ్చని కూరగాయలు:
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆకు పచ్చని కూరగాయలు చాలా లాభదాయకం. ఎందుకంటే ఆకుపచ్చని కూరగాయల్లో చాలా పోషక గుణాలుంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి దోహదపడుతుంది. రోజూ ఆకుపచ్చని కూరగాయలు, హెల్తీ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి.
Also Read: Asthma Diet Tips: రోజూ ఈ పండ్లు తింటే చాలు ఆస్తమాకు ఇన్‌హేలర్ అవసరం కూడా రాదిక
ఒత్తిడికి దూరం:
ఒత్తిడి అనేది హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణంగా ఉంటుంది. ఒత్తిడిలో ఉంటే హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. అందుకే సాధ్యమైనంతవరకూ ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలి. ఒత్తిడి దూరం కావాలంటే వీలైనంతవరకు ఒంటరితనాన్ని వదిలేయాలి. అంటే కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపాలి.
ఎప్పటికప్పుడు పరీక్షలు:
వయస్సు 40 దాటిన తరువాత ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్, డయాబెటిస్, థైరాయిడ్, ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. హార్ట్ ఎటాక్ ముప్పును దూరం చేసేందుకు మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండాలి.
Also Read: Weight loss tips: డైట్‌లో ఈ ఆకులుంటే చాలు..నెలరోజుల్లో స్థూలకాయానికి చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook