Liver Diseases: ఇటీవలి కాలంలో లివర్ సంబంధిత వ్యాధులు మహిళల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. మహిళల్లో కన్పిస్తున్న లివర్ వ్యాధులు , లక్షణాలు, నివారణకు ఏం చేయాలనేది వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో లివర్ చేసే పని కారణంగా ఆ అంగానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. శరీరంలో విడుదలయ్యే వివిధ హార్మోన్లను నియంత్రించడం, రక్తాన్ని శుభ్రం చేయడం, ప్రోటీన్లు ఉత్పత్తి, విష పదార్ధాలను శరీరం నుంచి తొలగించడం, శరీరంలోని వివిధ అవయవాలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ సరఫరా చేయడం అన్నీ లివర్ చేసే పనులే. అందుకే లివర్‌కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. లివర్ ఆరోగ్యంలో ఏ మాత్రం సమస్య తలెత్తినా ఇతర అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. ఇటీవలి కాలంలో లివర్ సంబంధిత వ్యాధులు ఎక్కువగా మహిళల్లో కన్పిస్తున్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. 


లివర్‌లో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు కాకుండా పెద్ద సమస్యల వల్ల పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇందులో ఒకటి లివర్ స్వెల్లింగ్. మహిళల్లో ఎక్కువగా ఈ వ్యాధి రావడానికి కారణం ఆల్కహాల్ కావచ్చు. లివర్ ఆరోగ్యంగా లేనప్పుడు రోగ నిరోధక కణాల ప్రభావం వల్ల లివర్‌లో వాపు కన్పిస్తుంది. లివర్ స్వెల్లింగ్ అనేది హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ లకు కారణమౌతుంది. అందుకే తినే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. సూదుల ద్వారా లేదా రక్షణ లేని లైంగిక చర్యల ద్వారా ఈ ప్రాణాంతక వైరస్ ఒకర్నించి మరొకరికి వ్యాపించవచ్చు. లివర్‌లో కొవ్వు ఎక్కువగా ఉన్నా ఈ సమస్య రావచ్చు.


లివర్ సిరోసిస్ మరో ప్రమాదకర వ్యాధి. కాలేయంలో ఉండే Bile ducts కొంతకాలానికి దెబ్బతినడం వల్ల పిత్తం అంతా కాలేయంలో పేరుకుపోతుంది. ఫలితంగా లివర్ సిరోసిస్ వ్యాధి వస్తుంది. థైరాయిడ్ వ్యాధి, ఆస్టియోపోరోసిస్, బ్రెస్ట్ కేన్సర్ వ్యాధులకు లివర్ సిరోసిస్‌కు సంబంధముంది. మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలుంటే లివర్ మార్పిడి తప్పదు. ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండే గర్భ నిరోధక పిల్స్ ఉపయోగించే మహిళల్లో కన్పించే వ్యాధి కాలేయంలో కణితి సమస్య. ఇది చాలా ప్రమాదకరం. 


అందుకే లివర్ సమస్యలతో బాధపడే మహిళలకు ఒకవేళ మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లుంటే తక్షణం మానుకోవాలి. హెల్తీ డైట్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. రోజూ తగిన సమయం వ్యాయామం లేదా వాకింగ్‌కు కేటాయించాలి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. 


Also read: Kidney Stones: బీరు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా, వాస్తవమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook