Parkinsons Disease: శరీరంలోని నాడి వ్యవస్థపై దాడి చేసే వ్యాధి పార్కిన్సన్స్ వ్యాధి. నరాలతో నియంత్రణలో ఉండే శరీర భాగాలకు ఈ వ్యాధితో నష్టం కలుగుతుంది. అత్యంత సంక్లిష్టమైన, దుర్లభమైన వ్యాధి ఇది. ఈ వ్యాధి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా సందర్భాల్లో ప్రారంభ లక్షణాలను గుర్తించలేం. ఈ వ్యాదికి సంబంధించి చాలా అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది పార్కిన్సన్స్ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఈ వ్యాది ఉన్నప్పుడు తలెత్తే ఇతర సమస్యలతో ప్రాణాలు పోయే అవకాశముంది గానీ పార్కిన్సన్స్ వల్ల కాదు. ప్రస్తుతం పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స ఏదీ అందుబాటులో లేదు. కొన్ని ధెరపీలద్వారా వ్యాధి లక్షణాలను తగ్గించవచ్చు. 


పార్సిన్సన్స్ వ్యాధి న్యూరో డీజనరేటివ్ వ్యాధి. శరీరంలోని జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. సాధారణ లక్షణం చేతులు, కాళ్లు వణకడం, బ్యాలెన్స్ లోపించడం వంటివి కన్పిస్తాయి. ఇతర లక్షణాల్లో మలబద్ధకం, డిప్రెషన్, ఆందోళన, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలేమి బౌల్ మూమెంట్ వంటివి ఉంటాయి. వణుకు లేదా జర్క్ తగలడం అనేది పార్కిన్సన్స్ వ్యాధిలో ప్రధాన లక్షణం. 


కేవలం మందుల ద్వారా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాల్ని తగ్గించవచ్చనేది అవాస్తవం. ఫిజికల్ యాక్టివిటీస్, వ్యాయామం, యోగా వంటి వాటితో పార్కిన్సన్ వ్యాధి లక్షణాల్ని తగ్గించవచ్చు. పార్కిన్సన్ వ్యాధి కేవలం వృద్దులకే వస్తుందనేది నిజం కాదు. ఎక్కువగా వయసు మళ్లినవారిలో కన్పిస్తుంది. యాంటీ పార్కిన్సన్ మందులతో వ్యాధి లక్షణాలు పెరుగుతాయనేది అవాస్తవం. ఈ వ్యాధిలో వినియోగించే లెవోడోపా మందులు వ్యాధి లక్షణాల్ని తగ్గించగలుగుతాయి. 


పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు కన్పించకపోతే ఫరవాలేదు. కానీ చాలా సందర్భాల్లో ఈ వ్యాది వస్తూ పోతూ ఉంటుంది. ఈ సందర్భంలో లక్షణాలు కన్పించకపోవచ్చు. ఈ వ్యాధిని పసిగట్టాలంటే వైద్యుని సంప్రదించకతప్పదు. ఎందుకంటే లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. 


Also read: High Cholesterol Signs: శరీరంలో ఈ 3 భాగాల్లో నొప్పి ఉంటే..కొలెస్ట్రాల్ సంకేతమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook