Sleep Paralysis: స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి
Sleep Paralysis: మనిషి ఆరోగ్యం అనేది ఆ వ్యక్తి ఆహారపు అలవాట్లు, జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. చాలా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యేముందు కొన్ని లక్షణాలు వెలుగుచూస్తుంటాయి. ఆ లక్షణాల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
Sleep Paralysis: దాదాపుగా అన్ని అనారోగ్య సమస్యలు ఏదో రూపంలో లక్షణాలు కనబరుస్తుంటాయి. స్లిప్ పెరాలసిస్ విషయంలో కూడా కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. రాత్రి పడుకునేముందు కదలడంతో ఇబ్బంది, మాటలో ఆటంకం వంటివి ఎదురుకావచ్చు. స్లిప్ పెరాలసిస్ ఉంటే ఈ లక్షణాలే కన్పిస్తాయి.
స్లిప్ పెరాలసిస్ అంటే ఏమిటి
స్లిప్ పెరాలసిస్ వ్యాధి ఉత్పన్నమైతే పడుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కదలడంలో లేదా మాట్లాడటంలో ఆటంకం రావచ్చు. ఒక్కోసారి ఈ లక్షణాలు 10-15 నిమిషాలు కూడా ఉండవచ్చు. సాధారణంగా స్లీప్ పెరాలసిస్ వ్యాధి 14-17 ఏళ్ల వయస్సులో మొదటిసారిగా ఎదురుకావచ్చు. స్లీప్ పెరాలసిస్ వ్యాధి ఉంటే నిద్రలో హఠాత్తుగా మెళకువ రావడం, అటూ ఇటూ కదల్లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భయం, విచిత్రమైన శబ్దాలు విన్పించడం, ఒత్తిడికి లోనవడం వంటిలక్షణాలు కన్పిస్తాయి.
స్లిప్ పెరాలసిస్ కారణాలు చాలానే ఉన్నాయి. నిద్రలేమి ఉండటం, ఒత్తిడి, నిద్రలో అంతరాయం వంటివి ఎదురుకావచ్చు. కొన్ని సందర్భాల్లో మందుల దుష్పరిణామాల వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. మనసు బ్యాలెన్స్ తప్పడం కూడా ఓ కారణం కావచ్చు.ఈ సమస్య నుంచి బయటపడేందుకు సరైన ప్రత్యామ్నాయం ఒకటే. కావల్సినంత నిద్రపోవడం. నిద్ర ప్రక్రియ సరిగ్గా ఉండేట్టు చూడటం. ఒత్తిడి తగ్గించేందుకు యోగా అలవర్చుకోవాలి.
స్లిప్ పెరాలసిస్ లక్షణాలుంటే ముందు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితి ఎక్కువ సేపు ఉండదు. అందుకే భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి. నెమ్మది నెమ్మదిగా కాళ్లు చేతులు కదపడం ప్రారంభించాలి. శ్వాస తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాస్తవానికి స్లిప్ పెరాలసిస్ గంభీరమైంది కానేకాదు. పెద్దగా ఆందోళన చెందకుండా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Milk Benefits: పాలలో ఈ 5 పదార్ధాలు కలిపి తాగితే, ఏ వ్యాధి దరిచేరదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook