Village Style Chicken Curry : ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్ లేదా మటన్ చేపలు వండుకోవాల్సిందే. అయితే, ఎక్కువశాతం మంది ఇష్టపడేది చికెన కూర. దీంతో తయారు చేసిన ఏ కూరలు అయినా రుచి అదిరిపోవాల్సిందే. అంతేకాదు మటన్ పోలిస్తే దీని ధర కూడా తక్కువ. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈరోజు పల్లెటూరి స్టైల్‌లో కోడికూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
చికెన్ -అరకేజీ, నూనె, ఉప్పు-రుచికి సరిపడా, కారం- రెండు టీస్పూన్లు, పసుపు- టీస్పూన్, ధనియాలు, జిలకర్రపొడులు- ఒక్కో చెంచా, టమాటలు- 2, ఉల్లిపాయలు-3, అల్లంవెల్లుల్లి పేస్ట్-టీస్పూన్, కొత్తిమీర, పుదీనా- ఒక్కోటీ, పచ్చిమిర్చి- 4, గరంమసాలా- చెంచా, కరివేపాకు - కొద్దిగా
ముందుగా చికెన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకుని నిమ్మరసం, ఉప్పు వేసి ఒక గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్ అల్లంవెల్లుల్లి రుబ్బుకోవాలి.
ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని బాగా వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు గోల్డెన్ కలర్‌లోకి మారాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, చికెన్ వేసి బాగా మగ్గించుకోవాలి.
ఆ తర్వాత నీరు అంతా ఇంకి పోతుంది. ఇందులో కారం కూడా వేసి టమోటాలు వేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత తగినన్ని నిళ్లు పోసుకోవాలి. ఓ 15 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరా, పుదీనా వేసుకోవాలి.
మరో ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జిలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అంతే రుచికరమైన పల్లెటూరి స్టైల్ చికెన్ కూర రెడీ అయినట్లే. ఇది చపాతీ, అన్నంలోకి తింటే ఆహా అనాల్సిందే..