Thrombosis: థ్రోంబోసిస్ అంటే రక్త నాళికల్లో రక్తం గడ్డకట్టుకుపోయే పరిస్థితి. ఫలితంగా రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. ధమనులు లేదా సిరల్లో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశముంది. దీనవల్ల మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. థ్రోంబోసిస్ సమస్య తలెత్తితే జీవితమే నరకప్రాయమైపోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థ్రోంబోసిస్ సమస్యకు కారణాలు


ఎక్కువ సమయం కదలిక లేకుండా ఒకేచోట ఒకే పొజీషన్‌లో ఉండటం వల్ల ముఖ్యంగా ప్రయాణాల్లో లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు థ్రోంంబోసిస్‌కు కారణం కావచ్చు


సర్జరీ లేదా ట్రామా అనేది బ్లడ్ వెసెల్స్‌ను దెబ్బ తీస్తుంది. 


జెనెటిక్ లేదా ఎక్కోర్డ్ బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్


కేన్సర్, హార్ట్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వంటి అనారోగ్య సమస్యలు


హార్మోనల్ మార్పులు లేదా హార్మోన్ మందుల సేవనం ముఖ్యంగా కాంట్రాసెప్టివ్ ట్యాబ్లెట్స్ వాడకం


స్థూలకాయం , స్మోకింగ్


థ్రోంబోసిస్ లక్షణాలు


నిర్ణీత ప్రదేశంలో నొప్పి లేదా తీవ్రంగా లాగుతుంటుంది, స్వెల్లింగ్ లేదా ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. చర్మం రంగు మారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. ఛాతీలో నొప్పి ఉంటుంది. 


థ్రోంబోసిస్ ముప్పు ఎలా తగ్గుతుంది


ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. జిమ్‌కు సమయం లభించకపోతే వాకింగ్ చేయడం, మెట్లెక్కి దిగడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒకే చోట కూర్చుని ఉండటం లేదా పడుకుని ఉండటం లేదా నిలుచుని ఉండటం చేయకూడదు. ప్రయాణం చేసేటప్పుడు కూడా అదే పనిగా కూర్చుని ఉండకూడదు. అటూ ఇటూ కాస్త తిరగడం మంచిది. 


శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. రోజు మొత్తంలో 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. శాచ్యురేటెడ్ ఫ్యాట్ తీసుకోవాలి. హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఫలితంగా క్లాటింగ్ సమస్య తగ్గుతుంది. సిగరెట్, స్మోకింగ్, హుక్కా, గాంజా, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. 


Also read: Green Peas Benefits: రోజూ గ్రీన్ పీస్ బఠానీ తింటే చాలు..ఎలాంటి వ్యాధి దరిచేరదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook