Women Health Tips: శరీర నిర్మాణంలో మగవారికి, మహిళలకు తేడా ఉంటుంది. మగవారితో పోలిస్తే మహిళలు సున్నితంగా ఉంటారు. ఎముకలు, కండరాలు బలహీనంగా ఉంటాయి. కొన్ని పోషక పదార్ధాల లోపముంటే..మహిళలల్లో పలు సమస్యలు తలెత్తుతాయి. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోటీన్ లోపముంటే మహిళలకు చాలా రకాల వ్యాధులు ఎదుర్కొంటారు. బలహీనత వెంటాడుతుంది. న్యూట్రియంట్ల లోపంతో అనారోగ్యం బాధిస్తుంది. ముఖ్యంగా విటమిన్ డి మహిళలకు తప్పనిసరి. ఇది లోపిస్తే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఎముకల నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి ఎదుర్కొంటారు. అసలు విటమిన్ డి లోపాన్ని ఎలా గుర్తించాలి..


ఎముకల బలహీనత


కాల్షియంకు ప్రాముఖ్యత ఉన్నట్టే విటమిన్ డి కూడా చాలా ముఖ్యమైంది. ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. మహిళల శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా ఉంటే ఏ సమస్యా తలెత్తదు. లోపిస్తే మాత్రం ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి.


తరచూ వ్యాధిగ్రస్థులవడం


మహిళల్లో విటమిన్ డి లోపించడం వల్ల ఇమ్యూనిటీ పడిపోతుంది. ఎప్పుడైతే మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో వివిధ రకాల వ్యాధులు పీడిస్తాయి. ఇమ్యూనిటీ తగ్గితే తరచూ వ్యాధులు సోకుతుంటాయి. విటమిన్ డి రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తే అంటువ్యాధుల ముప్పు తగ్గుతుంది.


అలసట


విటమిన్ డి లోపముంటే మహిళల రోజువారీ జీవితం కష్టమైపోతుంది. సాధారణ పనులు కూడా చేసుకోలేరు. అలసట కలుగుతుంటుంది. అలసట, బలహీనం కారణంగా ఏ పనీ చేసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం తగ్గిపోతుంది. 


ఆందోళన


విటమిన్ డి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. మగవారితో పోలిస్తే మహిళలు ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారు. ఈ పరిస్థితుల్లో విటమిన్ డి లోపిస్తే మరింత ఆందోళనకు గురవుతుంటారు. ఒత్తిడికి గురై లేని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటారు. విటమిన్ డిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. లేత సూర్య కిరణాల్లో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజూ కనీసం 10-20 నిమిషాల ఎండలో నిలబడితే విటమిన్ డి లోపం తలెత్తదు. పాల ఉత్పత్తులు, ఫ్యాటీ చేపల ద్వారా కూడా ఈ సమస్య పరిష్కరించవచ్చు. 


Also read: Protein Importance: మనిషికి ప్రోటీన్లు ఎందుకు అవసరం, ప్రోటీన్ల లోపంతో తలెత్తే సమస్యలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook