కొద్దిరోజుల్లో అంటే మార్చ్ 8వ తేదీన దేశమంతా హోళీ జరుపుకోనుంది. అత్యంత వైభవంగా జరుపుకునే హోళీ వేడుకల్లో..వివిధ రకాల రంగుల్లో మునిగితేలనున్నారు జనం. వివిధ రకాల కెమికల్స్ కారణంగా చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారమేంటనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోళీ సందర్భంగా ఒకరికొకరు రంగులు చల్లుకుంటారు. రంగు నీళ్లతో స్ప్రే చేసుకుంటారు. రంగుల్లోనే మునిగితేలుతుంటారు. ఓ విధంగా చెప్పాలంటే రంగు నీళ్లలో దాదాపుగా స్నానం చేసినట్టుగా ఉంటారు. అయితే మార్కెట్‌లో లభించే వివిధ రకాల కెమికల్ రంగుల కారణంగా స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల్నించి విముక్తి పొందేందుకు హోళీ వేడుకల తరువాత పసుపు నీళ్లతో స్నానం చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి రక్షణ కవచంలా ఉపయోగపడతాయి. పసుపు నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం అన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్ నుంచి సేఫ్‌గా ఉంటుంది. 


ఓ బకెట్ గోరు వెచ్చని నీళ్లలో ఒక కప్పు పసుపు కలపాలి. నీళ్లలో బాగా కలపాలి. హోళీ వేడుకలు పూర్తయ్యాక ఈ పసుపు నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలేవీ తలెత్తవు. ఇతరత్రా ఇన్‌ఫెక్షన్స్ కూడా దూరమౌతాయి. హోళీ వేడుకలు పూర్తయ్యాక..పసుపు నీళ్లతో స్నానం చేయకపోతే..కచ్చితంగా ఇన్‌ఫెక్షన్స్ తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు ఎదురౌతాయి. ఎందుకంటే మార్కెట్‌లో లభించే రంగులు కెమికల్స్ లేకుండా ఉండనే ఉండవు. 


Also read: Garlic Side Effects: వెల్లుల్లి ఎవరెవరు తినకూడదు, తింటే ఏమౌతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook