Health tips: ఫిట్‌నెస్ సమస్య, ఏజీయింగ్ లక్షణాలు దూరం చేయాలంటే ఈ డైట్ తప్పనిసరి
Health tips: ఆధునిక పోటీ ప్రపంచంలో ఫాస్ట్ఫుడ్స్ సంస్కృతి పెరిగిపోయింది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు, స్థూలకాయం లేదా అధిక బరువుకు ఇదే కారణమౌతోంది. మరి ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలి..పూర్తి వివరాలు మీ కోసం..
Health tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా వివిధ కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో పాటు శారీరక సమస్యలు ఎదురౌతుంటాయి. స్థూలకాయం లేదా అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్య, ఏజీయింగ్ సమస్య ఇలా అన్నీ ఒకదానివెంట మరొకటిగా వేధిస్తుంటాయి.
అందుకే మనం తినే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యకరమైందిగా ఉండాలి. అయితే ఈ బిజీ ప్రపంచంలో ఏది హెల్తీ ఫుడ్, ఏది కాదని ఎంచుకునే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలోనే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌పై ఎక్కువగా ఆధారపడిపోతుంటారు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలకు కారణం ఇదే. బయట ఉన్న కాలుష్యాన్ని మనం నియంత్రించలేకపోయినా కనీసం ఆహారపు అలవాట్లనైనా నియంత్రించుకోగలం.
జీవితంలో మూడు దశల ఎదుగుదలతో పాటు మూడు కీలకమైన మార్పులు జరుగుతాయి. కండరాల అభివృద్ధితో పాటు ఎముకలు పటిష్టంగా మారడం, హార్మోనల్ మెచ్యూరిటీ, ఇమ్యూనిటీ. ఈ మూడు కీలక పరిణామాలు సక్రమంగా జరగాలంటే రోగ నిరోధక శక్తి సరిగ్గా ఉండాలి. ఎముకల అభివృద్ధి జరగాలంటే ప్రతి రోజూ తగిన మోతాదులో ప్రోటీన్లు, కాల్షియం ఉండాలి. విటమిన్ డి, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ కె, కొలేజన్, ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరమౌతాయి. ఈ పోషక గుణాలు ఎముకలు విరగకుండా పటిష్టంగా ఉండేందుకు దోహదపడతాయి.
రక్తం
హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం కోసం ఐరన్, విటమిన్ బి12, ఫోలేట్ అవసరం. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు కావల్సిన రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పాలకూర, పన్నీర్, పాలకూర అన్నం, పాలకూర పప్పు, పప్పు, మెంతి పరాటా వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
హార్మోనల్ మెచ్యూరిటీ
సరైన డైట్, తగిన మోతాదులో ప్రోటీన్లు, అధిక ఫైబర్, ఒత్తిడి లేని జీవితం, నిర్ణీత పద్ధతిలో వ్యాయామం, బరువు నియంత్రణలో ఉండటం, మంచి నిద్ర అనేవి చాలా అవసరం.
Also read: White mango Facts: తెల్ల మామిడి పండ్లను ఎప్పుడైనా చూశారా? ఈ దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook