White Mango Benefits: భారత్‌లో వేసవి కాలం నడుస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఎక్కువగా మామిడి పండ్లు లభిస్తాయి. వీటిని చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్ మామిడికి పండ్లు చాలా రకాలుగా లభిస్తున్నాయి. ఇందులో కొన్ని రుచి కరంగా ఉంటే మరికొన్ని మాత్రం చాలా పుల్లవిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండ్లు వివిధ రకాలుగా లభిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో తెల్ల మామిడి పండ్లు కూడా లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల మామిడి ప్రతి రోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెల్ల మామిడి పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ఫ్రీ రాడికల్స్, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తెల్ల మాడిని తినడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. తెల్ల మామిడిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో హైడ్రేటెడ్ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు
3. జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా తెల్ల మామిడి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తీవ్ర పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
4. తెల్ల మామిడిలో బీటా కెరోటిన్ లభిస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రే చీకటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
5. ఈ మామిడిలో ఉండే బీటా కెరోటిన్ ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంమ కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా అంటు వ్యాధులు కూడా దూరమవుతాయి.
6. తెల్ల మామిడి పండ్లను తినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook