Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తోందా..అయితే రోజూ ఈ పండ్లు తినండి చాలు
Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్ నిర్ణీత మోతాదు దాటితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కొన్ని రకాల పండ్లు డైట్‌లో భాగంగా చేసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు పండ్లు కీలకంగా ఉపయోగపడతాయి. అదే సమయంలో కొన్ని పండ్లు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించుకోవచ్చు.
పండ్లలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఇ పుష్కలంగా లభించే పండ్లు తింటే జలుబు వంటి సీజనల్ వ్యాధులు దూరమౌతాయి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య దూరమౌతుంది. మీరు కూడా యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే..డైట్‌లో కొన్ని పండ్లను తప్పకుండా చేర్చుకోవాలి. యూరిక్ యాసిడ్ సమస్య నియంత్రించేందుకు ఎలాంటి పండ్లు తినాలో తెలుసుకుందాం..
జాంకాయలు
జాంకాయల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. దాంతోపాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ పెద్దమొత్తంలో ఉంటుంది. మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే..జాంకాయలు తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నిర్మూలనలో కూడా జాంకాయలు అద్భుతంగా ఉపయోగపడతాయి.
నిమ్మకాయ
నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ నిమ్మను ఏ రూపంలో తీసుకున్నా..యూరిక్ యాసిడ్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
లీచీ
లీచీ పుల్ల పుల్లదా తియగా ఉంటుంది. ఇందులో పెద్దమొత్తంలో విటమిన్లు ఉంటాయి.అందుకే వీటిని రోజూ తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గాలంటే లీచీ పండ్లు మంచి ప్రత్యామ్నాయం.
బత్తాయి పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే రోజూ బత్తాయి పండ్లు తింటే విటమిన్ సి అవసరం తీరిపోతుంది. దాంతోపాటు యూరిక్ యాసిడ్ సమస్య దూరమౌతుంది.
Also read: Diabetes Control Tips: డైట్‌లో ఈ మూడు మసాలా దినుసులుంటే..మధుమేహం ఎంత ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook