Cholesterol Tips: కొలెస్ట్రాల్ సమస్య వచ్చి పడిందా, రోజూ ఈ పదార్ధాలు తీసుకుంటే చాలు
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఇటవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోతోంది. అయితే కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ ..వీటిని సాధారణంగా లైఫ్‌స్టైల్ డిసీజెస్‌గా పిలుస్తారు. అంటే జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే సమస్యలివి. వీటిలో అతి ముఖ్యమైంది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎందుకు ప్రమాదకరం, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ అధికమైతే గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రక్త నాళికలు కొలెస్ట్రాల్ కారణంగా బ్లాక్ అవుతుంటాయి. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో చాలా రకాల లక్షణాలు కన్పిస్తాయి. ముఖ్యంగా కొన్ని వ్యాధులు ఎదురౌతాయి. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా అవసరం. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా సులభమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కొలెస్ట్రాల్ పెరిగితే ఈ పదార్ధాలు తీసుకోవల్సిందే
ఓట్స్
మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే వెంటనే అప్రమత్తం కావాలి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం ప్రారంభించాలి. దీనివల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ బయటకు వచ్చేస్తుంది. అంటే అధిక కొలెస్ట్రాల్ సమస్యకు ఓట్స్ మంచి పరిష్కారంగా చెప్పవచ్చు.
యాపిల్
యాపిల్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. యాపిల్ రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ ఎవే అన్నట్టు రోజుకొక యాపిల్ తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య పోతుంది. యాపిల్ తినడం వల్ల అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.
క్యారట్ ప్రయోజనాలు
క్యారట్ ఆరోగ్యానికి చాలా లాభదాయకం. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడే వివిధ రకాల పదార్ధాల్లో కీలకమైంది. కొలెస్ట్రాల్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే క్యారట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఫైబర్ ఫుడ్స్
కొలెస్ట్రాల్ నియంత్రణకు ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఫైబర్ పుడ్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ అంత వేగంగా తగ్గుతుంది.
Also read: What is Menopause: మెనోపాజ్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook