Cholesterol: చలికాలంలో పొరపాటున కూడా ఇవి తినొద్దు, కొలెస్ట్రాల్ వేగంగా పెరిగే ప్రమాదం
Cholesterol: చలికాలంలో బాడీని ఫిట్‌గా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే కొలెస్ట్రాల్ ముప్పు ఎక్కువై..ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే చలికాలంలో కొన్ని రకాల పదార్ధాలకు దూరంగా ఉండాలి.
చలికాలం అనేది వివిధ రకాల వ్యాధులకు అనువైన సమయం. అందుకే చలికాలంలో ఆరోగ్యంపై దృష్టి ఎక్కువగా పెట్టాలి. బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలి. లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
కొలెస్ట్రాల్ అనేది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఎందుకంటే చలికాలంలో చాలామంది ముందూ వెనుకా ఆలోచించకుండా వివిధ రకాల పదార్ధాలు తినేస్తుంటారు. దాంతో కొలెస్ట్రాల్ పెరిగి వ్యాధుల ముప్పు వెంటాడుతుంది. ఈ క్రమంలో క్రమంలో ఈ సీజన్‌లో కొన్ని రకాల పదార్ధాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. చలికాలంలో ఎలాంటి పదార్ధాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
చలికాలంలో తినకూడదని పదార్ధాలు
జంక్ ఫుడ్స్
జంక్ ఫుడ్స్ అనేవి ఆరోగ్యంపై ఎప్పుడూ చెడు ప్రభావమే చూపిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల స్థూలకాయం సమస్య పెరుగుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే జంక్ ఫుడ్స్‌లో మైదాతో పాటు చాలా మసాలా పదార్ధాలుంటాయి. జంక్ ఫుడ్స్ సేవించడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.
ఫ్రై ఫుడ్
ఫ్రైడ్ పదార్ధాలు కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల స్థూలకాయం పెరగడమే కాకుండా చాలా రకాల వ్యాధుల భయం వెంటాడుతుంది. ఈ పదార్ధాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికమౌతుంది. అదే సమయంలో ఫ్రైడ్ పదార్ధాల వల్ల జీర్ణక్రియ కూడా కష్టమౌతుంది.
స్వీట్స్
స్వీట్స్ తినడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది. ఎందుకంటే స్వీట్స్‌లో పెద్దమొత్తంలో పంచదార, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి హాని కల్గిస్తాయి. అందుకే స్వీట్స్‌కు దూరంగా ఉంటేనే కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook