Detoxing Body: ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా శరీరం అంతర్గత క్లీనింగ్. దీనికై సులభమై చిట్కాలు ఏమున్నాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్యం మనం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం ఆహారపు అలవాట్లే. జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇష్టారాజ్యంగా తినడం వల్ల వివిధ రకాల సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. విష పదార్ధాలు శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. శరీరంలోని టాక్సిన్స్ దూరం చేసేందుకు సులభమైన కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శరీరంలోంచి విష పదార్ధాల్ని తొలగించవచ్చు. ఫ్రైడ్, ఆయిలీ, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల విష పదార్ధాలు పెరిగిపోతాయి. సాధారణంగా..ఆకుపచ్చని కూరగాయలు, గ్రీన్ టీ, పండ్లు, సలాడ్ , నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి పదార్ధాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో దోహదపడతాయి.


సాధారణంగా బరువు తగ్గేందుకు చాలామంది వర్కౌట్లు వంటివి చేస్తుంటారు. కానీ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అనేది బరువు తగ్గేందుకే కాకుండా శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు సైతం ఉపయోగపడతుంది. జిమ్ లేదా గ్రౌండ్‌లో చెమట్లు పట్టడం వల్ల శరీరంలో విష పదార్ధాలు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ స్ట్రెచింగ్, యోగా తప్పకుండా అలవాటు చేసుకోవాలి.


శరీరాన్ని డీటాక్సిఫై చేసేందుకు నిద్ర కూడా చాలా ముఖ్యమైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ సరైన నిద్ర తప్పకుండా ఉండాలి. సరైన నిద్ర ఉంటే సెల్స్ రికవర్ అవడమే కాకుండా విష పదార్ధాలు దూరమౌతాయి. ప్రతిరోజూ అంటే 24 గంటల్లో 8 గంటలు నిద్ర తప్పకుండా ఉండాలి. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసికంగా బాగుంటుంది. 


శరీరానికి నిద్రతో పాటు నీళ్లు కూడా అంతే అవసరం. దీనికి కారణం శరీరంలో ఎక్కువ భాగం నిర్మితమైంది నీళ్లతోనే. నీళ్లు తగినంత తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ ప్యూరిఫికేషన్ సాధ్యమౌతుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల టాక్సిన్స్ యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా చర్మంపై నిగారింపు పెరుగుతుంది. ముఖంపై మచ్చలు కూడా దూరమౌతాయి. రోజుకు 7-8 లీటర్ల నీరు తప్పకుండా తాగాలి.


Also read: How To Weight Gain: ఇలా చేస్తే మీరు కేవలం 20 రోజుల్లో బరువు పెరగడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook