How To Weight Gain: ఇలా చేస్తే మీరు కేవలం 20 రోజుల్లో బరువు పెరగడం ఖాయం..

Weight Gain Foods: బరువు తగ్గడం ఎంత కష్టమో..బరువు పెరడం కూడా అంతే కష్టం. అయితే ఈ రెండు అంశాలకు కచ్చితంగా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. కొంత మంది బరువు పెరగడం వల్ల అందంగా కనిపిస్తే మరికొందరు బరువు తగ్గడం వల్ల అందంగా కనిపిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 05:07 PM IST
  • ఇలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారు
  • హోం మేడ్‌ స్మూతీలు తీసుకుంటే..
  • సులభంగా బరువు పెరుతారు
How To Weight Gain: ఇలా చేస్తే మీరు కేవలం 20 రోజుల్లో బరువు పెరగడం ఖాయం..

Weight Gain Foods: బరువు తగ్గడం ఎంత కష్టమో..బరువు పెరడం కూడా అంతే కష్టం. అయితే ఈ రెండు అంశాలకు కచ్చితంగా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. కొంత మంది బరువు పెరగడం వల్ల అందంగా కనిపిస్తే మరికొందరు బరువు తగ్గడం వల్ల అందంగా కనిపిస్తారు. ప్రస్తుతం చాలా మంది పోషకాలున్న ఆహారాలను తీసుకొకపోవడం వల్ల బరువు తగ్గి అందహీనంగా తయారవుతున్నారు. బరువు పెంచుకొవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం పొందలేకపోతున్నారు. బరువును ఆరోగ్యంగా పెంచుకోవడానికి చాలా రకాల మార్గాలున్నాయి. ఆ మార్గాలను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో తప్పకుండా పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు పెరగడానికి హెల్తీ డైట్ ఆప్షన్స్ ఇదే

1) హోం మేడ్‌ స్మూతీలు:
ఇంట్లో తయారుచేసిన స్మూతీలో చాలా రకాల కేలరీలు ఉంటాయి. ఇవి బరువును పెంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా స్మూతీల్లో అరటి, కాయలు, బెర్రీలు, యాపిల్స్‌తో తయారు చేసుకుంటే.. కేవలం వారం రోజుల్లోనే కిలో కంటే ఎక్కువ బరువు పెరుగుతారని నిపుణులు తెలుపుతున్నారు.

2)వైట్ రైస్:
వైట్ రైస్ సులభంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. భారత్‌లో వీటిని విచ్చల విడిగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో అధిక పరిమాణాల్లో కార్బోహైడ్రేట్ల లభిస్తాయి. వైట్ రైస్ తీసుకుంటే శరీర బరువు పెరగడమేకాకుండా..బాడీకి మంచి శక్తిని ఇస్తుంది. అయితే వైట్‌ రైస్‌తో పాటు వెన్న, గ్రేవీ, పనీర్,  గుడ్లు తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతారని నిపుణులు తెలుపుతున్నారు.

3) గింజలు:
గింజలు శరీరానికి చాలా ఆరోగ్యకరం.. వీటిలో అధిక పరిమాణంలో క్యాలరీలు ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు సులభంగా పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముడి గింజల్లో  ప్రోటీన్, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కావున వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారడమేకాకుండా బరువు సులభంగా పెరుగుతారు.

4)మాంసం:
కండరాల అభివృద్ధికి మాంసం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర మాంసం తరచుగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు పేర్కొన్నారు. కావున బరువు పెరగడానికి తప్పకుండా ఇలాంటి ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి.

5) బంగాళదుంపలు:
బంగాళాదుంపలు బరువు పెరగడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఫైబర్ అధిక పరిమాణాల్లో ఉంటుంది. కావున వీటిని అతిగా తీసుకుంటే శరీరం దృఢంగా మారుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News