చలికాలంలో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు సాధారణం. ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కొన్ని చిట్కాలతో ఈ సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో సాధారణం తిన్న ఆహారం జీర్ణమవడంలో సమస్య ఏర్పడుతుంది. అజీర్తి సమస్య దీర్ఘకాలంగా ఉంటే..మలబద్ఖకంగా మారుతుంది. మలబద్ధకం సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే..పైల్స్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీస్తుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యల్నించి విముక్తి పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..


1. చలికాలంలో సాధారణంగా గోరు వెచ్చని నీళ్లు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. గోరు వెచ్చని నీళ్లతో కేవలం జలుబు, దగ్గు సమస్య దూరమవడమే కాకుండా..మలబద్ధకం ముప్పు కూడా దూరమౌతుంది. రోజూ ఉదయం లేచిన వెంటనే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్య చిటికెలో మాయమౌతుంది. 


2. చలికాలంలో చాలామంది వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంటారు. ఇందులో ఎండు ద్రాక్ష మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో పెద్దమొత్తంలో ఫైబర్ ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. ఎండు ద్రాక్షను నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే చాలా లాభదాయకం.


3. అజీర్తి సమస్యను దూరం చేసేందుకు సోంపు కూడా మంచి ప్రత్యామ్నాయం. సోంపు తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో గ్యాస్ట్రిక్ ఎంజైమ్ పెరుగుతుంది. పాలు, కడుపు సమస్యలపై ప్రభావం పడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 


Also read: Honey Mask: అందమైన, మృదువైన కేశాలు, చర్మం కోసం ఇలా చేయండి చాలు, 2 వారాల్లోనే ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook