Honey for Weight Loss in 20 Days: హెల్త్ కాన్సెస్ అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని అనుకుంటుంటారు. ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు అటు లైఫ్‌స్టైల్ ఇటు ఆహారం రెండూ ఆరోగ్యకరమైందిగా ఉండాలి. ప్రకృతిలో లభించే ఓ అద్భుతమైన పదార్ధంతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. అదే సమయంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం, స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యలు బాధించడం ఉంటుంది. స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలి. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే అటు వ్యాయామం, ఇటు డైట్ రెండూ అవసరమే. దీనికోసం తేనె అద్భుతంగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. 


మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించేవి చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే. వివిధ రకాల జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ , ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. శరీరం అస్తవ్యస్థంగా మారుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచకపోవడం వల్ల డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రకృతిలో సహజసిద్దంగా లభించే తేనెతో ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. తేనెను చాలా రకాలుగా తీసుకోవచ్చు. 


Also Read: How To Cure Piles: ఈ యోగాసనాలతో తీవ్ర పైల్స్‌ సమస్యలకు 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!


గోరువెచ్చని నీళ్లతో తేనె కలిపి తీసుకోవడం అత్యుత్తమ పద్ధతి. రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఎనర్జీ రావడమే కాకుండా స్థూలకాయం సమస్య తగ్గుతుంది. అయితే ఏదో వారమో రెండు వారాలో చేసి వదిలేస్తే సరిపోదు. కనీసం రెండు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా కూడా ఉంటుంది.


మజ్జిగలో తేనె కలుపుకుని తాగడం మరో విధానం. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు, చల్లగా ఉంచేందుకు మజ్జిగలో తేనె కలిపి తాగడం మంచి పద్ధతి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభదాయకం. మజ్జిగలో తేనె కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపకశక్తి సైతం పెరుగుతుంది. మనస్సు రిలాక్స్ అవుతుంది. 


నిమ్మరసంలో తేనె కొద్దిగా కలుపుకుని తాగినా మంచి ఫలితాలుంటాయి. వేసవిలో ఇలా చేయడం మంచిది. శరీరం డీహ్రైడ్రేట్ కాకుండా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమౌతాయి. అయితే రోజూ ఉదయం పరగడుపున తీసుకోవల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకోవాలి. కనీసం 7-8 వారాలు ట్రై చేస్తేనే ఫలితం కన్పిస్తుంది. ఆ తరువాత కూడా కొనసాగించాలి. 


Also Read: Pineapple Juice: పైనాపిల్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు తెలుసా? ఈ జ్యూస్ పై ఏ ఎనర్జీ డ్రింక్ పనికిరాదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి