మనిషి ఎదుర్కొనే చాలా వరకూ అనారోగ్య సమస్యలకు ప్రకృతిలో పరిష్కారం లభిస్తుంది. ఇందులో ముఖ్యమైంది తేనె. తేనెను క్రమం తప్పకుండా డైట్‌లో భాగంగా చేసుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవు. తేనెను ఏ విధంగా ఎలా తీసుకోవాలో కూడా పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే అద్భుతమైన ఔషధం తేనె. తేనెతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. తేనెలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, విటమిన్ బీ6, కార్బోహైడ్రేట్స్, ఎమైనా యాసిడ్స్ వంటి పోషకాలు ఏ విధమైన ఇన్‌ఫెక్షన్‌ను దరిచేరనివ్వవు. శరీరానికి అంతగా రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. ప్రతిరోజూ పరగడుపున తేనె సేవించడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడం, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లు దూరమవడం, ఇమ్యూనిటీ పెరగడం ఇలా చాలా రకాలుగా ప్రయోజనం కల్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని రోజూ పరగడుపున సేవిస్తుంటే..ఒత్తిడి దూరమౌతుంది. 


గొంతు సమస్యలు


దగ్గు తగ్గించేందుకు తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతులో కఫాన్ని దూరం చేస్తాయి. ఫలితంగా దగ్గు కూడా తగ్గుతుంది. దీనికోసం రోజూ గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని సేవించాలి. చాలామందికి గొంతులో గరగర అధికంగా ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పరగడుపున తేనెను వాము లేదా అల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితముంటుంది. గొంతులో గరగర తగ్గడమే కాకుండా కఫం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


తేనె పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు


ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందుకే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌కు వెళ్లడం, వాకింగ్, యోగా చేయడం, డైటింగ్ చేయడం ఇలా ఎన్నో పద్థతులు అవలంభిస్తుంటారు. కానీ ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని పరగడుపున తాగితే సులభంగా బరువు తగ్గుతారు. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇందులో కొద్గిగా నిమ్మరసం  లేదా జీలకర్ర పౌడర్ కలుపుకుంటే ఇంకా మంచిది.


Also read: High Blood Pressure​: మీ బీపీని తగ్గిండానికి ఈ 4 జ్యూస్‌లు చాలు.. అనారోగ్య సమస్యలకు కూడా చెక్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook