Raw Milk Vs Boiled Milk: పాలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కొంతమంది పచ్చిపాలు తాగుతుంటారు. ఇంకొంతమంది ఉడికించిన పాలు తాగుతుంటారు. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన ఆరోగ్యం కోసం పాలు, గుడ్లను బెస్ట్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. కొంతమందైతే పాలను కంప్లీట్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇందులో దాదాపు అన్ని రకాల న్యూట్రియంట్లు లభిస్తాయి. అందుకే మెరుగైన ఆరోగ్యం కోసం పాలు తాగమని సూచిస్తుంటారు. అయితే కొంతమంది పచ్చిపాలు నేరుగా తాగుతుంటారు. ఇంకొంతమంది ఉడికించి తాగుతుంటారు. ఈ రెండింటిలో ఏది మంచిదనే విషయం గురించి తెలుసుకుందాం..


పాలు ఆరోగ్యానికి మంచివే. కానీ పచ్చి పాలు తాగడం మంచిదా లేదా ఉడకబెట్టిన పాలు తాగాలా అనే ప్రశ్నలు వస్తుంటాయి. పచ్చి పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనే వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆరోగ్య శాఖకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అందించిన వివరాల ప్రకారం పచ్చిపాలలో హాని కల్గించే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే ఈకోలి, లిస్టేరియా, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా పచ్చిపాలలో ఉండే అవకాశాలున్నాయి. అందుకే పచ్చి పాలు తాగడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలుంటాయి.


పచ్చి పాలు తీసుకోవడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి కీడు కల్గిస్తుంది. ఫలితంగా డయేరియా, డీ హైడ్రేషన్ వంటి సమస్యలు ఏర్పడతాయి. శరీరంలో యాసిడ్ స్థాయి కూడా పెరుగుతుంది. పాలు తీసేటప్పుడు ఆ జంతువుల పొదుగు కలుషితమై ఉంటుంది. అంతేకాకుండా..పాలు తీసే వ్యక్తుల చేతులు లేదా పరిసరాలు లేదా గిన్నె కూడా కలుషితమై ఉండవచ్చు. ఆ పాలు నేరుగా పచ్చిగా తాగితే ఆ కలుషితమంతా మీ శరీరంలో చేరుతుంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకే పాలను బాగా ఉడికించి చల్లారిన తరువాత తాగడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. 


Also read: Cholesterol Tips: అల్లంతో నాలుగు చిట్కాలు, నాలుగు వారాల్లో కొలెస్ట్రాల్ పూర్తిగా మటుమాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook