Protein Importance: సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్లు, మినరల్స్ చాలా ముఖ్యం. ఈ రెండింటినీ కలిపి స్థూలంగా న్యూట్రియంట్స్ అని పిలుస్తారు. ఇందులో ఏ ఒక్క పోషక పదార్ధం లోపించినా ఏదో ఒక సమస్య ఉత్పన్నమౌతుంది. శరీరం పనితీరు సరిగ్గా ఉండదు. శరీరానికి అవసరమైన పోషక పదార్ధాల్లో అత్యంత ముఖ్యమైంది ప్రోటీన్. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు తగిన పరిమాణంలో ఉండాల్సిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరం నిర్మాణ సమయంలో అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పౌష్ఠిక ఆహారం తీసుకోకపోతే శిశువుకు ప్రోటీన్ల లోపం సమస్య తలెత్తుతుంది. అందుకే తల్లికి పౌష్ఠికాహారం తినమని వైద్యులు తరచూ సలహా ఇస్తుంటారు. ప్రోటీన్లు శరీరంలో మజిల్స్, స్కిన్, ఎంజైమ్స్, హార్మోన్స్ అభిమివృద్ధికి దోహదపడతాయి. ప్రోటీన్లు శరీరం సెల్స్ నిర్మాణం, మరమ్మత్తులకు చాలా అవసరం. కరోనా మహమ్మారి సమయంలో సైతం రోగ నిరోధక శక్తికి ప్రోటీన్లే కీలకంగా మారాయి. 
వివిధ అధ్యయనాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ ప్రజలు ప్రోటీన్ల లోపంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఎదిగే పిల్లలకు, వృద్ధులకు ప్రోటీన్లు చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్ల లోపముందనేది తెలుసుకోవడం కూడా కష్టమే అవుతుంటుంది. కండరాలు బలహీనమైపోవడం, మజిల్ పెయిన్స్, జుట్టు బలహీనమై రాలిపోవడం, ఎముకల పటుత్వం తగ్గడం, త్వరగా విరగడం,త్వరగా అలసట రావడం, జాయింట్ పెయిన్స్, చర్మం డ్రైగా మారి నిర్జీవంగా ఉండటం, జుట్టు రాలడం, గోర్ల సమస్యలు వంటివి శరీరంలో ప్రోటీన్ల లోపానికి ప్రధాన లక్షణాలు.


ప్రోటీన్ లోపంతో కలిగే నష్టాలు


1. ప్రోటీన్ల లోపంతో తరచూ శరీరంలో ఏదో ఒక భాగంలో ఇన్‌ఫెక్షన్ సోకుతుంటుంది. 


2. మనిషి శరీరంలో ప్రోటీన్లు, కాల్షియం లోపముంటే గోర్లు విరగడం, ఎముకలు పటుత్వం కోల్పోవడం జరుగుతుంటుంది.  


3. మజిల్స్‌లో ప్రోటీన్ల లోపముంటే..మజిల్స్ పెయిన్ సమస్యగా మారుతుంది. 


4. ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. 


5. శరీరంలో ప్రోటీన్ల లోపం వల్ల చాలా అలసటగా ఉంటుంది. ప్రోటీన్ల వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. 


6. ప్రోటీన్ల లోపంతో కేశాలు రాలిపోవడం, డ్రైగా మారడం, నిర్జీవంగా కన్పించడం వంటి సమస్యలు కన్పిస్తాయి. 


7. ప్రోటీన్ల లోపంతో కొత్త సెల్స్ నిర్మాణం ఆలస్యమౌతుంది. ఫలితంగా హీలింగ్‌లో ఇబ్బంది రావచ్చు.


8. ప్రోటీన్ల లోపంతో శరీరం ఒక్కసారిగా ఉబ్బినట్టయి..లావుగా అన్పిస్తుంది. 


9. ప్రోటీన్ల లోపముంటే ఇమ్యూనిటిపై ప్రభావం పడుతుంది. దీనినల్ల రోగ నిరోధక సామర్ధ్యం తగ్గి తరచూ వ్యాధిగ్రస్థులౌతుంటారు.


10. శరీరంలో ప్రోటీన్ల లోపంతో ముఖం, చర్మం, కడుపులో స్వెల్లింగ్ సమస్య రావచ్చు.


Also read: Ginger Effects: అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook