Soaked Superfoods: రోజూ పరగడుపున ఇవి తీసుకుంటే.. జీవితంలో ఏ రోగమూ దరిచేరదు
Soaked Superfoods for All Diseases: చాలామందికి ఆహారపు అలవాట్లపై అవగాహన ఉండదు. లేచిన వెంటనే ఏదిపడితే అది తినేస్తుంటారు ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంటుంది. ఉదయం పరగడుపున తీసుకునే తిండి ప్రభావం నేరుగా ఆరోగ్యంపై చూపిస్తుంది. అందుకే ఉదయం వేళ ఏం తినాలో తెలుసుకోవాలి.
Away From All Diseases with these Dry Fruits: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన తిండి అవసరం. హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమై..దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజూ లేచిన వెంటనే ఏం తినాలి, ఏం తినకూడదనే వివరాలు పూర్తిగా తెలుసుకోవడం అవసరం.
చాలామంది ఉదయం లేచినవెంటనే ముందూ వెనుకా ఆలోచించకుండా వివిధ రకాల పదార్ధాలు తింటుంటారు. వీటి ప్రభావంగా నేరుగా ఆరోగ్యంపై చూపిస్తుంది. ఇంకొంతమందైతే ఉదయం లేచిన తరువాత చాలా సేపటి వరకూ పరగడుపునే ఉంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే ఉదయం లేచిన వెంటనే కొన్ని పదార్ధాలను తప్పకుండా తినాల్సి ఉంటుంది.
కిస్మిస్
కిస్మిస్ శరీరానికి చాలా ఆరోగ్యకరమైంది. ఇందులో పెద్దమొత్తంలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉంటాయి. ఇవి రోజూ తీసుకోవడం వల్ల శరీరం బలహీనత దూరమౌతుంది. దాంతోపాటు హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అటు పరగడుపున కిస్మిస్ తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి వేళ 6 కిస్మిస్ గింజల్ని నీళ్లలో నానబెట్టి..ఉదయం పరగడుపున నీళ్లతో సహా తినాలి.
బాదం
బాదం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో పెద్దమొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. వీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే..మెమరీ పవర్ పెరుగుతుంది. బరువు తగ్గించేందుకు సైతం దోహదపడుతుంది.
ఎండు ఖర్జూరం
ఎండు ఖర్జూరంలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరం. రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం తినడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. అదే సమయంలో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు బరువు తగ్గించేందుకు సైతం ఉపయోగపడుతుంది.
Also read: Dandruff Remedies: 4 రోజుల్లో జుట్టులో చుండ్రుకు చెక్ పెట్టొచ్చు.. కేవలం రూ. 10తో.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook