Salt Vs Sugar Benefits and Side Effects: మనం రోజూ తినే వివిధ రకాల ఆహార పదార్ధాల్లో రెండు తప్పనిసరిగా ఉంటాయి. అవి ఉప్పు, పంచదార. ఈ రెండింటి ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుంది. ఈ రెండింట్లో దేనివల్ల ఆరోగ్యం పాడవుతుంది, వాస్తవమేంటనేది..? మరియు రెండూ ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తాయా..??


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాల్ట్ అండ్ షుగర్. రెండూ దైనందిన జీవితంలో ఏదో ఒక పదార్ధంలో భాగమై ఉంటుంటాయి. వీటి ప్రభావం ఆరోగ్యంపై పడుతుంటుంది ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. మనిషి శరీరంలో అతి ముఖ్య అంగమైన గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఈ క్రమంలో సాల్ట్ అండ్ షుగర్ రెండింట్లో ఏది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందనేది తెలుసుకుందాం..


ఉప్పు దుష్పరిణామాలు


ఉప్పు ఎక్కువగా సేవించడం వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుంది. రక్తపోటు అనేది గుండె ఆరోగ్యాన్ని నష్టపరుస్తుంది. అంతేకాకుండా మధుమేహం వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఎక్కువగా రక్తపోటు కారణంగానే సంభవిస్తుంటాయి.


పంచదార దుష్పరిణామాలు


పంచదార తినడం వల్ల పళ్లకు హాని చేకూరుతుంది. నోటి దుర్వాసన, పంటి నొప్పి సమస్యలు ఎక్కువగా స్వీట్స్ తినేవారిలోనే వస్తుంటాయి. పంచదారలో కేలరీలు అధికంగా ఉండటం వల్ల స్థూలకాయం సమస్య వెంటాడుతుంది. స్వీట్స్ ఎక్కువగా తినేవారిలో గుండెపోటు సమస్యలు కూడా ఎక్కువని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.


Also Read: Cholesterol tips: ఈ 4 డ్రింక్స్ తాగితే చాలు కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలించవచ్చు


  • స్థూలంగా చెప్పాలంటే సాల్ట్, షుగర్ రెండూ హానికారకాలే. గుండె ఆరోగ్యం విషయంలో మాత్రం పంచదార కంటే సాల్ట్ ఎక్కువ నష్టాన్ని కల్గిస్తుంది. అందుకే తినే ఆహారంలో సాధ్యమైనంతవరకూ సాల్ట్ తక్కువగా ఉండేట్టు ప్రయత్నించాలి. 

  • పంటి ఆరోగ్యం విషయంలో మాత్రం స్వీట్స్ చాలా హాని చేకూరుస్తాయి. పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే స్వీట్స్ తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని తినాలి. లేకపోతే పంటి సమస్యలు తప్పవు.

  • మీరు తినే ఆహార పదార్ధాల్లో షుగర్, సాల్ట్ తక్కువ మోతాదులో ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం పండ్లు, కూరగాయలు గుడ్లు, పాలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ , నట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.

  • స్వీట్స్, సాల్ట్ స్థానంలో వాటికి ప్రత్యామ్నాయంగా పండ్లు లేదా జ్యూస్ సేవించడం మంచి అలవాటు. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. షుగర్, సాల్ట్ లేకపోతే మీరు తీసుకునే ఆహార పదార్ధాలు రుచికరంగా ఉండకపోవచ్చు కానీ గుండె ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తప్పనిసరి ఇది.హెల్తీ ఫుడ్ అనేది జీవనశైలిలో ఓ భాగం కావాలి.


Also Read: Papaya Side Effects: బొప్పాయితో దుష్పరిణామాలు కూడా, ఈ సమస్య ఉంటే బొప్పాయి తినకూడదు మరి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి