Sugar Free Habits: 30 రోజులు నో షుగర్ ఛాలెంజ్‌తో కలిగే 5 మార్పులివే
Sugar Free Habits: పంచదార ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరమో తెలియాలంటే ఓ నెలరోజులు మానేస్తే మీ శరీరంలో కలిగే మార్పులే చాలు. కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి.
పంచదార అతిగా తింటే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. దురదృష్టవశాత్తూ భారతీయులు స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, చాకొలేట్స్, సాఫ్ట్ డ్రింక్స్, క్యాండీ వంటి తీపి పదార్ధాలంటే ఇష్టపడుతుంటారు. పంచదార ఎంత ప్రమాదకరమో చూద్దాం..
పంచదార అతిగా అంటే పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పంచదార కారణంగానే స్థూలకాయం, ఫ్యాటీ లివర్, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ముప్పు పెరిగిపోతుంటుంది. పంచదారతో కలిగే ప్రమాదాన్ని అంచనా వేయాలంటే..ఓ నెలరోజులు నో షుగర్ ఛాలెంజ్ పాటిస్తే చాలు. నెలరోజుల తరువాత మీ శరీరంలో కన్పించే పలు మార్పులే సాక్ష్యంగా నిలుస్తాయి. ముఖ్యంగా 5 రకాల మార్పులు కన్పిస్తాయి.
30 రోజులు నో షుగర్ ప్రయోజనాలు
1. బ్లడ్ షుగర్ నియంత్రణ
30 రోజులవరకూ పంచదార తినకుండా ఉంటే చాలా కీలకమైన ప్రయోజనాలు లభిస్తాయి. మీ బ్లడ్ గ్లూకోజ్ స్థాయి సులభంగా తగ్గుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గిపోతుంది. కానీ నెల రోజుల తరువాత తిరిగి పంచదార తినడం ప్రారంభిస్తే ఏ విధమైన ప్రయోజనం ఉండదు. నో షుగర్ ఛాలెంజ్ అలాగే కొనసాగించాల్సి ఉంటుంది.
బరువు తగ్గడం
తినే ఆహారంలో పంచదార ఎక్కువగా ఉంటే శరీరానికి కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలుండవు. తీపి పదార్ధాలు తినడం వల్ల షుగర్ ఫ్యాట్‌గా మారుతుంది. నెమ్మది నెమ్మదిగా మీ శరీరం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందుకే పంచదారను మీ జీవితం నుంచి ఎంత తగ్గిస్తే అన్ని ప్రయోజనాలున్నాయి.
గుండెకు ఆరోగ్యం
పంచదార తినడం వల్ల నేరుగా ఆ ప్రభావం గుండె వ్యాధులపై పడుతుంది. పంచదార కొవ్వుగా మారితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. ఫలితంగా అధిక రక్తపోటు సమస్యగా మారుతుంది. రక్తం గుండె వరకూ చేరడంలో ఒత్తిడి ఎక్కువై..హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. ఇండియాలో ఎక్కువమంది గుండెపోటు కారణంగానే ప్రాణాలు విడుస్తున్నారు. పంచదారను దూరం పెడితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
లివర్‌కు ప్రయోజనం
లివర్ శరీరంలో కీలకమైన అంగం. లివర్ చాలా రకాల విధులు నిర్వహిస్తుంది. ఎక్కువ మోతాదులో పంచదార తీసుకుంటే...నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పు పెరుగుతుంది. అందుకే పంచదారకు దూరంగా ఉండాలి.
డెంటల్ ఆరోగ్యం
షుగర్ ఆధారిత ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల పళ్లకు హాని కలుగుతుంది. ఫలితంగా కేవిటీ, చిగుళ్ల వ్యాధులు , నోటి దుర్గంధం ముప్పు ఉత్పన్నమౌతుంది. ఎందుకంటే స్వీట్స్ తినడం వల్ల నోట్లో బ్యాక్టీరియా చేరుతుంది.
Also read: Heart Attack: ఈ ఒక్క పదార్ధాన్ని డైట్‌లో చేరిస్తే చాలు, గుండె వ్యాధి ముప్పు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook