ఇండియాలో గుండెవ్యాధి రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆరోగ్య నిపుణుల సూచనలు పాటిస్తే గుండె వ్యాధి ముప్పును తగ్గించవచ్చంటున్నారు. దీనికోసం సెమోలినా తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
సెమోలినాలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మంచి కొలెస్ట్రాల్, ప్రోటీన్లు, విటమిన్లు, విటమిన్ ఎ, రిబోఫ్లెవిన్ బీ2, ఫోలేట్ బీ9, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం, జింక్ గుణాలు అత్యధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఇవి కాకుండా సెమోలినాలో కొలెస్ట్రాల్ ఏ మాత్రం ఉండదు. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.
సెమోలినా కలిగే 4 కీలక ప్రయోజనాలు
గుండె వ్యాధులు దూరం
సెమోలినా గుండె వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు సెమోలినాను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఓ అధ్యయనం ప్రకారం సెమోలినా వాడినప్పుడు హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గిపోయింది.
ఇన్‌స్టంట్ ఎనర్జీ
సెమోలినాలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. అందుకే వైద్యులు సెమోలినా తినమని సూచిస్తున్నారు.
ఎనీమియా దూరం
సెమోలినాలో ఎక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది. ఈ క్రమంలో ఐరన్ లోపం దూరం చేసేందుకు సెమోలినా వినియోగం ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఎనీమియా వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
బెల్లీ ఫ్యాట్ మాయం
మీరు మీ బెల్లీ ఫ్యాట్ కరిగించాలనుకుంటే..లేదా స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందాలంటే సెమోలినా తప్పకుండా తీసుకోవాలి. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కీలకంగా ఉపయోగపడుతుంది. త్వరగా ఆకలేయకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గించుకోవడంలో దోహదపడుతుంది.
Also read: Skin Care Tips: వయస్సు 30 ఏళ్లు దాటినా అందంగా, ఫిట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heart Attack: ఈ ఒక్క పదార్ధాన్ని డైట్‌లో చేరిస్తే చాలు, గుండె వ్యాధి ముప్పు దూరం