Diabetes Control Fruits: మధుమేహం ఉంటే తీపి పదార్ధాలకు పూర్తిగా దూరం పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో కొన్ని రకాల పండ్లు కూడా తినకూడదు. కానీ అత్యంత తీపిగా ఉండే ఈ మూడు రకాల పండ్లు మాత్రం నిరభ్యంతరంగా తినవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక పోటీ ప్రపంచంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా మధుమేహం చాలా వేగంగా వ్యాపిస్తోంది. డయాబెటిస్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. ఎందుకంటే మధుమేహానికి చికిత్స లేదు. నియంత్రణ ఒక్కటే దీనికి పరిష్కారం. వివిధ రకాల పద్ధతులు అవలంభించడం ద్వారా మధుమేహం వ్యాధికి చెక్ పెట్టవచ్చు. మధుమేహాన్ని నియంత్రించే కొన్ని ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం..


చీకూ ఫ్రూట్ ఆరోగ్యపరంగా అద్భుతమైంది. ఇది రుచిపరంగా తీపిగా ఉన్నా మధుమేహం వ్యాధిగ్రస్థులు తినవచ్చు. ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. అందుకే అనారోగ్యమైతే  చీకూ ఫ్రూట్ తినమని వైద్యులు సూచిస్తుంటారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కూడా తినవచ్చు కానీ బాగా పండింది తినకూడదు. 


ఇక రెండవది కిన్నూ ఫ్రూట్. ఇది ఆరెంజ్ మరియు బత్తాయి మిశ్రమంగా చెప్పవచ్చు. ఇది కూడా కాస్త తీపిగానే ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు చాలా ఉన్నాయి. బత్తాయి జాతికి చెందింది కావడంతో తీపిగా ఉంటుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులు ఏ మాత్రం సంకోచం లేకుండా తినవచ్చు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు.


ద్రాక్ష సీజన్ మొత్తం పండే ఫ్రూట్. ఇందులో గ్రైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కావడంతో మధుమేహం ఉన్నా సరే ఆనందంగా తినవచ్చు. ఇది తీపిగా ఉన్నా సరే మధుమేహం వ్యాధిగ్రస్థులు ఏం కాదు. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండేవారికి ఈ ఫ్రూట్ మంచి ప్రత్యామ్నాయం. 


Also read: Ghee Benefits: తరచూ జబ్బు పడుతున్నారా, బరువు పెరిగిపోతున్నారా, రోజూ నెయ్యి తింటే అన్నింటికీ చెక్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook