Heart Attack Risk: ఈ మూడు చెడు అలవాట్లే గుండెపోటుకు ప్రధాన కారణాలు
Heart Attack Risk: దేశంలో గుండెపోటు రోగాలు పెరుగుతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా మూడు రకాల చెడు అలవాట్లు ప్రమాదాన్ని తెచ్చిపెట్టనున్నాయి.
ఆధునిక జీవితంలో బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల రోగాలు పెరిగిపోతున్నాయి. ఇందులో హార్ట్ ఎటాక్ కీలకమైంది. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్య ఉంటుంది కానీ..గత కొన్నేళ్లుగా తక్కువ వయస్సుకే గుండెపోటు ముప్పు పెరిగిపోతోంది.
ఇటీవలి కాలంలో ప్రముఖ సెలెబ్రిటీలు సిద్ధార్ద్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్, సింగర్ కేకే, కొన్ని రాష్ట్రాల మంత్రులు హార్ట్ ఎటాక్ కారణంగా తక్కువ వయస్సుకే ప్రాణాలొదిలిన పరిస్థితి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గుండెకు రక్త సరఫరాలో ఇబ్బంది కలిగితే గుండెపోటు సమస్య తలెత్తుతుంది. సాధారణంగా రక్త వాహికల్లో కొలెస్ట్రాల్ ఇతర వ్యర్ధాలు ఏమైనా పేరుకుపోయినప్పుడే రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. రోజూ తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ ముప్పు పెరిగిపోతుంటుంది. ఆ పొరపాట్లు ఏంటి, ఎలా సంరక్షించుకోవాలనేది అందరూ తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలవాట్లు మార్చుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చు.
హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గించే అలవాట్లు
1. బరువు నియంత్రణలో ఉండటం
పోటీ ప్రపంచంలో చాలామంది స్థూలకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. హార్ట్ ఎటాక్ ముప్పుకు ఇదే ప్రధాన కారణం. స్థూలకాయానికి కారణం హై బ్లడ్ కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిసరాయిడ్స్, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం ముప్పు. ఈ పరిస్థితులన్నీ హార్ట్ ఎటాక్ ముప్పును పెంచేస్తాయి. అందుకే హార్ట్ ఎటాక్ ముప్పును తగ్గించాలంటే ముందు బరువు పెరగకుండా చూసుకోవాలి.
2. స్మోకింగ్ మరియ టెన్షన్
ధూమపానం, ఎక్కువగా ఒత్తిడికి లోనవడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు చాలా అధికంగా ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలింది. ధూమపానం చేసినప్పుడు ధమనుల్లో ప్లక్స్ ఏర్పడతాయి. దాంతో ధమనులు సంకోచించి గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు సమస్య తలెత్తుతుంది. అదే విధంగా ఎక్కువగా ఒత్తిడికి లోనవడం వల్ల బ్లడ్ ప్రెషర్ సమస్య పెరిగిపోతుంది. గుండెపోటుకు ఇది ప్రధాన కారణం.
3. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం
ఏ మాత్రం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా బతికేద్దామనుకుంటే ఈ అలవాటు హార్ట్ ఎటాక్ ముప్పును పెంచుతుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే గుండె రోగాల ముప్పు కచ్చితంగా పెరుగుతుంది. శరీరం నిష్క్రియగా మారడం వల్ల ధమనుల్లో వసాయుక్త పదార్ధం ఏర్పడుతుంది. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు దెబ్బతింటే గుండె వరకూ రక్తం చేరడంలో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, గుండె రోగాలు చాలా వరకూ తగ్గుతాయి.
హార్ట్ ఎటాక్ లక్షణాలు
ఛాతీలో తీవ్రమైన నొప్పి, చెమట్లు పట్టడం, శ్వాసలో ఇబ్బంది, వాంతులు, నోరెండిపోవడం తల తిరగడం, ఆకస్మిక అలసట, ఛాతీ మధ్యలో కొద్ది సేపు నొప్పి లేదా పట్టేసినట్టుండటం, గుండె నుంచి భుజాలు, మెడ, చేతుల వరకూ నొప్పి రావడం.
Also read: Ginger Side Effects: అల్లం అతిగా తీసుకుంటే మంచిది కాదా, ఏయే సమస్యలు రావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook