Vitamin D Symptoms: విటమిన్ డి శరీరానికి చాలా అవసరమైన ఒక కీలకమైన విటమిన్. ఇది పుష్కలంగా లభించేది సూర్యరశ్మిలోనే. అయితే మోతాదుకు మించితే మాత్రం అనర్ధమేనంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన ఆరోగ్యం కోసం అవసరమయ్యే చాలా రకాల విటమిన్లు, మినరల్స్‌లో విటమిన్ డి ఒకటి. ఇది చాలా కీలకమైంది. పూర్తిగా ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ డి పాత్ర ముఖ్యమైంది. విటమిన్ డి కేవలం శరీరంలో కాల్షియంను బాడీ గ్రహించేందుకే కాకుండా..మజిల్స్ సెల్స్‌కు కూడా చాలా అవసరం. విటమిన్ డి పుష్కలంగా లభించేది ఒక్క సూర్యరశ్మిలోనే. ఇదే అత్యంత ఆరోగ్యకరమైంది. కొన్ని సప్లిమెంట్స్ ద్వారా కూడా విటమిన్ డి లభిస్తుంది కానీ..ఇవి శరీరానికి అంత మంచిది కాదు. విటమిన్ డి ఎక్కువైతే..కలిగే అనర్ధాలేంటో చూద్దాం..


విటమిన్ డి అదే పనిగా తరచూ తీసుకుంటే..జీర్ణ వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. విటమిన్ డి కారణంగా రక్తంలో కాల్షియం స్థాయి పెరిగిపోతుంది. ఫలికంగా కడుపులో నొప్పి, ఆకలి వేయకపోవడం, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. మీ శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే..మీకు కూడా అసౌకర్యంగానే ఉంటుంది. పదే పదే వాంతులు రావడం, అజీర్ణ సమస్య వంటివి ఎదురౌతాయి. ఫలితంగా తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏ పనీ చేయలేరు. 


విటమిన్ డి ఎక్కువవడం వల్ల అంతర్గతంగా భ్రమ వంటి స్థితి తలెత్తుతుంది. తీవ్రమైన సందిగ్దత పరిస్థితి ఏర్పడుతుంది. ఏ నిర్ణయమూ తీసుకోలేరు. ఎందుకంటే విటమిన్ డి ఎక్కువ అవడమనేది డీహైడ్రేషన్ వల్ల కూడా తలెత్తవచ్చు. విపరీతమైన దాహం వేయడం కూడా విటమిన్ డి ఎక్కువైందనేందుకు ఓ లక్షణం..


Also read: Heart Attack Risk: గుండె సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తినాలి.. ఎందుకో తెలుసా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook