Ajwain Benefits: మెటబోలిజం అనేది శరీర ఆరోగ్య ప్రక్రియలో అత్యంత కీలకం. మెటబోలిజం సక్రమంగా ఉందంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధం. అంతటి కీలకమైన జీవక్రియను సులభమైన చిట్కాతో మెరుగుపర్చుకోవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లతో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతున్నాయంటే..శరీరం జీవక్రియ అంటే మెటబోలిజంలో సమస్య ఉన్నట్టే. మెటబోలిజం అనేది మనిషి ఆరోగ్యానికి చాలా కీలకం. మెటబోలిజంలో సమస్య ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభమైన చిట్కాతోనే మెరుగుపర్చుకోవచ్చు.


మనకు ఎదురయ్యే సకల రోగాలకు కారణం జీవక్రియ లేదా మెటబాలిజం మందగించడమే. జీవక్రియ మెరుగ్గా ఉంటే ఏ రోగాలు అంత సులభంగా దరిచేరవు. మరి ఆ మెటబాలిజంను మెరుగుపర్చేది వాము లేదా అజ్వైన్ వాటర్. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. రోజూ వాము నీరు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు బరువు తగ్గించుకునేందుకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని జీవక్రియను వాము నీరు మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఊబకాయం నియంత్రించవచ్చంటారు వైద్య నిపుణులు. 


వాము లేదా అజ్వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, నికోటిన్ యాసిడ్, కార్పొహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. వామునీరు క్రమం తప్పకుండా తీసుకుంటే.. గొంతు నొప్పితో బాధపడేవాళ్ళు, నోటి నుంచి దుర్వాసన వెలువడేవారికి ఉపశమనం కలుగుతుంది. 


ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాము నీరు తీసుకోవల్సి ఉంటుంది. ఒక చెంచా వాము గింజల్ని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. ఉదయం ఆ నీటీని మరిగించి..వడపోసి తాగాలి. ఇలా చేయడం ద్వారా..వివిధ రకాల ఆరోగ్య సమస్యల్నించి దూరం చేసుకోవచ్చు.


ఇక మహిళలకు సంబంధించి తరచూ పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పి అనేది సర్వ సాధారణంగా కన్పిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు నీటిలో వామును బాగా మరగబెట్టి చల్లార్చి తీసుకోవాలి. ఫలితంగా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 


Also read: Insomnia Remedies: నిద్రలేమితో అన్నీ సమస్యలే, సులభమైన చిట్కాలతో ఉపశమనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook