Insomnia Remedies: నిద్రలేమితో అన్నీ సమస్యలే, సులభమైన చిట్కాలతో ఉపశమనం

Insomnia Remedies: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లే కాదు..నిద్ర కూడా సరిగ్గా ఉండాల్సిందే. ఆధునిక జీవితంలో సగం సమస్యలు నిద్రలేమితోనే వస్తున్నాయనేది ఓ అధ్యయనం. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2022, 10:47 PM IST
Insomnia Remedies: నిద్రలేమితో అన్నీ సమస్యలే, సులభమైన చిట్కాలతో ఉపశమనం

Insomnia Remedies: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లే కాదు..నిద్ర కూడా సరిగ్గా ఉండాల్సిందే. ఆధునిక జీవితంలో సగం సమస్యలు నిద్రలేమితోనే వస్తున్నాయనేది ఓ అధ్యయనం. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి..

మనిషికి ఆరోగ్యం చాలా ప్రధానమైంది. ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం ఆహారమే కాదు. నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ఆధునిక జీవన శైలిలో ఈ సమస్య చాలా ఎక్కువౌతోంది. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే..ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చాలామందికి వివిధ కారణాలతో రాత్రిళ్లు త్వరగా నిద్రపట్టదు. బెడ్‌పై గంటల 
కొద్దీ దొర్లుతూనే ఉంటారు కానీ నిద్రపోలేరు. కళ్లు మూసుకున్నా ఏదో ఆలోచనలు వెంటాడుతూ నిద్ర రావడం లేదని లేచిపోతుంటారు. ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో నిద్ర పడుతుంది. కొందరికి అది కూడా పట్టదు.ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇలా నిద్రపట్టక బాధపడేవారు ఈ టిప్స్ పాటిస్తే వెంటనే నిద్రపడుతుంది. అవేంటో చూడండి.

రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేస్తా కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలున్నాయి. లేదా గసగసాల్ని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించి వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకల్ని మృదువుగా దువ్వుతూ లేదా చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసినా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా నిద్ర పడుతుంది. అలా కాదనుకుంటే రాత్రి పూట గోరు వెచ్చని పాలు..మిరియాల పౌడర్ కలుపుకుని తాగాలి. 

మరీ ముఖ్యంగా నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. అంతేకాదు రాత్రిళ్లు తల పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావంతో కూడా సరిగ్గా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ ఫోన్‌ను దూరంగా పెట్టడం చాలా మంచిది. 

రోజూ రాత్రి పడుకునేముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయడం లేదా మంచి మంచి దృశ్యాల్ని ఊహించుకుని మెమరైజ్ చేయడం అలవాటు చేసుకోంది. కచ్చితంగా ఫలితముంటుంది. లేదా శ్రావ్యమైన లలిత సంగీతాన్ని స్లో వాల్యూమ్‌లో పెట్టుకుని వింటూ ప్రశాంతంగా కళ్లు మూసుకుని ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. 

Also read: Dengue Tips: వర్షాకాలం డెంగ్యూ అలర్ట్, ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి. ఎలా పెరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News